గిట్టుబాటు లేక రైతు ఆగమాగం
ఖరీఫ్ వరి కోతలు అక్టోబర్ చివరి నుంచే ప్రారంభమయ్యాయి. పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయం అంటే అనేక వ్యయప్రయాసలను ఎదుర్కొని చేపట్టడంగా మారింది. ప్రభుత్వపరంగా సకాలంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
ఖరీఫ్ వరి కోతలు అక్టోబర్ చివరి నుంచే ప్రారంభమయ్యాయి. పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయం అంటే అనేక వ్యయప్రయాసలను ఎదుర్కొని చేపట్టడంగా మారింది. ప్రభుత్వపరంగా సకాలంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పొలంలో కోసిన ధాన్యాన్ని నిల్వ చేసుకునే సదుపాయం, ఆరబెట్టుకునే సౌకర్యాలు లేక రైతులు తప్పని పరిస్థితుల్లో మధ్యదళారులకు అమ్ముతున్నారు. మార్కెట్లో ఇప్పుడు కిలో బియ్యం ధర రూ.95 పలుకుతున్నది. కానీ క్వింటాల్ ధాన్యాన్ని దళారులు రూ.2,200 లకే రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. అంటే రైతన్న ఆర్థికంగా ఎంత నష్టపోతున్నాడో ఇట్టే అర్థమవుతున్నది.
బియ్యం ఎగుమతుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉన్నది. 2024-2025లో మన దేశం బియ్యం ఎగుమతుల ద్వారా 12.47 బిలియన్ డాలర్లకు పైగా (రూ.1,04,000 కోట్లు) విదేశీ మారకాన్ని ఆర్జించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో రూ.45,739 కోట్ల ఆదాయాన్ని పొందింది. భారత్‌లో అత్యధికంగా వరి పండించే రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. కేంద్ర వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఏటా రెండుసార్లు ఖరీఫ్, రబీల పంటలకు కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఈ ధరలకు అనుగుణంగా ధాన్యం కొనుగోళ్లు జరగాలి. గ్రామ స్థాయిలో రైతులు తమ పంటలను విక్రయించుకోవడానికి ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోళ్లు జరగాలి. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (ఎస్ఇఆర్పీ) ఆధ్వర్యంలో మహిళా సంఘాల ద్వారా నిర్వహించే ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ గురించి కూడా రైతులు ఎదురుచూస్తున్నారు.
నిత్యావసర వస్తువుల చట్టం 1955 సెక్షన్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించిన అధికారాలను అనుసరించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు, డీలర్లు మిల్లింగ్ చేసిన బియ్యాన్ని లెవీ కింద 75 శాతం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)కి పంపిణీ చేయా లి. ఈ మిల్లింగ్ లెవీ పథకం రైతులకు ప్రయోజనం చేకూర్చడంతోపాటు నేషనల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (ఎన్పీడీఎస్) ద్వారా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రకారం చౌకధరల దుకాణాల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తారు.
అదేవిధంగా కరువు, కాటకాలను ఎదుర్కోవడానికి ఆహార భద్రత గురించి ఆలోచించి కూడా బియ్యాన్ని నిల్వ చేస్తారు. ఇక రైస్‌మిల్లర్లు, డీలర్లు 75 శాతం లెవీ బియ్యం కింద ఎఫ్‌సీఐకి ఇవ్వగా మిగిలిన 25 శాతం బియ్యాన్ని ఆయా జిల్లా కలెక్టర్లకు సమాచారం ఇస్తూ బహిరంగ మార్కెట్, ఇతర రాష్ర్టాల్లోనూ అమ్ముకునే అవకాశం ఉన్నది. కానీ రైతులకు మాత్రం ధాన్యం కొనుగోలులో రూపొందించిన విధివిధానాలు కఠినంగా ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం నిర్ధారించిన నాణ్యతా, ప్రమాణాలు ఆకర్బనం/ఇన్ ఆర్గానిక్, సేంద్రియత/ఆర్గానిక్ 1.0 శాతం ఉండాలి. దెబ్బతిన్న, రంగుమారిన, మొలకెత్తిన, వీవిల్డ్ ధాన్యాలు 3.0 శాతం, అపరిపక్వమైన, కుంచించుకుపోయిన ధాన్యాలు 3.0 శాతం, దిగువ తరగతికి వచ్చిన ధాన్యం 7.0 శాతం, తేమ 17.0 శాతం అని పరిమితులను విధించారు. వడ్ల నుంచి వచ్చిన బియ్యం తీపిగా, పొడిగా, ఆరోగ్యపరంగా మంచి ఆహార విలువ, ఏకరీతి రంగు, మంచి పరిమాణం కలిగి ఉండాలి. అలాగే రైతులు ధాన్యాన్ని విక్రయించే సమయంలో నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించే అధికార యంత్రాంగం అందుబాటులో తప్పకుండా ఉండాలి.
రైతు సాగు చేయడం వలన ప్రజలకు ఆహార భద్రతతో పాటుగా ఎగుమతుల ద్వారా కూడా విలువైన విదేశీ మారకంతో దేశాభివృద్ధి జరుగుతుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన వ్యవసాయ రంగానికి, రైతులకు సమయానుకూలంగా ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో పాలకులు విఫలమవుతున్నారు.
ఖరీఫ్‌లో పండిన వరి, ఇతర పంటలకు కనీస మద్దతు ధరలతో కొనుగోలు చేసి రైతులకు అండగా ఉండవలసిన బా ధ్యత ప్రభుత్వంపై ఉన్నది. అలాగే ఫెయిర్ యా వరేజ్ క్వాలిటీ (ఎఫ్ఏక్యూ), నాన్ ఫెయిర్ యా వరేజ్ క్వాలిటీ నిర్ణయం, తూకంలో కోతలు లే కుండా, సత్వరం డబ్బుల చెల్లింపులు చేయాలి.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోమౌలిక సదుపాయాల ఏర్పాట్లు కూడా పటిష్టం చేయాలి. ఐకేపీ కేంద్రాల్లో రెవెన్యూ శాఖ అధికారులు, ఉద్యోగులు కస్టోడియన్స్‌గా విధులను నిర్వహించి, రైతులకు సంరక్షకులుగా ఉండాలి. డీఆర్డీఏ, జిల్లా జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోల పర్యవేక్షణ నిరంతరం కొనసాగాలి. రోజువారీగా పౌరసరఫరాల కమిషనర్ వీడియో సమావేశాలను నిర్వహిస్తూ అధికారులను పురమాయించాలి.
రైతులు తమ ధాన్యం నింపుకోవడానికి గోనె సంచులు, వర్షం నుంచి ధాన్యం తడువకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలి. లోడింగ్, అన్లోడింగ్ సౌకర్యాలు, కొనుగోలు కేంద్రాల్లో జాప్యం వంటి కష్టనష్టాలను విన్నవించుకోవడానికి హెల్ప్‌లైన్ నంబర్ ఇచ్చి ఎలాంటి సమస్యలు ఎదురైనా ఫోన్ చేసినపుడు ఆయా అధికారులు సహకరించేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా వెంటనే ప్రారంభించి, రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది.
(వ్యాసకర్త: సింగరేణి కార్మిక సంఘం నేత)
మేరుగు రాజయ్య
9441440791
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

