చౌరస్తా

ఆర్థిక గాలాలకు చిక్కి
ఆగమౌతున్న ఆధునికుడు
అసలు మూలాలు మరిచి
ఆదిమానవుడై చరిస్తూ…
ఆత్మీయతా వాకిళ్లలో
ఆరని చిచ్చులు పెడుతూ
ఆప్యాయతా పుప్పొడులపై
పగల సెగల బుసలు కొడుతూ…
పోలికల పోటీలలో
పసిడి గోడలే శాశ్వతమని
బంధాల చలువ పందిరి పీకేసి
నవ్వుల తీగలు తెంపేస్తూ…
ఈర్ష్యా వీధులే బలమంటూ
అలజడి రథంపై ఊరేగుతూ
స్వార్థపు పాతాళం చీకట్లలో
గల్లంతై, లోహపు మరమనిషై …
కుళ్ళు కళ్ళతో కపట నటనతో
మమతల మేడలు చూర్ణించి
బంధం తెగిన గాలి పటంలా
పల్టీలు కొట్టే లోక సంచారి…
అసూయ అడ్డుగోడలు దాటి
అహం పొరలు చీల్చి
మానవ చౌరస్తాకి చేరువై
త్యాగ చరిత్రను తడిమేదెన్నడో..
డాక్టర్ మండల స్వామి 9177607603
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

