ఆటిజం ఉన్న పిల్లలు ఇతరులతో సరిగా మాట్లాడలేరు, పదే పదే ఒకే పని చేయడం, లేదా ఒకే మాట పలుమార్లు అంటుండటం చేస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో వారి స్పందన నెమ్మదిగా ఉంటుంది. ప్రతి 125 మంది పిల్లలలో ఒకరు ఆటిజంతో బాధపడుతున్నారు. ప్రపంచంలో 70 కోట్ల మంది పిల్లలకు ఆటిజం ఉందని ఒక అంచనా. ఈ వ్యాధికి కారణం తెలియదు కానీ జన్యుపరమైన మార్పుల వల్ల ఇది సంభవిస్తుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. చిన్నపిల్లల్లో వచ్చే ఆటిజం సమస్యను భూతద్దంలో చూడకుండా దాన్ని పరిష్కరించుకునే దిశగా ఆలోచించాలి.
ఆటిజం పైకి కనిపించే సమస్య కాకపోవడంతో తల్లిదండ్రులు దీన్ని గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు. దానితో సమస్య పెరిగిపోతున్నది. ఈ సమస్యపై చదువుకున్న వారికి కూడా సరైన అవగాహ న లేకపోవడం వల్ల దాన్ని గుర్తించడం కష్టమవుతున్న ది. చిన్నారులు బుడి బుడి అడుగులతో ముద్దు ము ద్దు మాటలతో బోసి నవ్వులతో ఈ ప్రపంచంలోని ఆనందమంతా కుప్పలుగా పోసినట్టుండాలి. కానీ అందుకు భిన్నంగా ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోవడం, ఏదో తెలియని పరధ్యానం, కొన్నిసార్లు కారణం లేకుండానే బిగ్గరగా ఏడవడం, పదేపదే అల్లరి చేయడం, తమను తామే గాయపర్చుకోవడం చేస్తుంటారు. పిల్లలకున్న ఈ రుగ్మతను ఆటిజం అం టారు. ఈ సమస్య ఉన్న పిల్లల సంఖ్య ఇటీవలి కాలం లో పెరుగుతున్నది. ఏడాది వయస్సు వచ్చేసరికే తప్పటడుగులు వేయాల్సిన చిన్నారులు ఒకరి సాయం లేనిదే అడుగు కూడా వేయలేని స్థితిలో ఉండిపోతున్నారు. పుట్టుకతోనే సంక్రమించే వివిధ వ్యాధులతో తల్లడిల్లుతున్న చిన్నారులను చూడలేక తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతం.
ఆటిజం కమ్యూనికేషన్ డిజార్డర్
ఆటిజం అనే వ్యాధి చిన్నారుల జీవితాలను మొగ్గలోనే దారిమళ్లిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా పుట్టుకతోనే ఈ వ్యాధి భారిన పడి కొన్ని కోట్ల మంది చిన్నారులు అల్లాడుతున్నారు. కన్నవారిని గుర్తించలేక, వారేం చేస్తున్నారో వారికే తెలియక, ఎదుటివారు చెప్పేది అర్థం కాక, ఓ విధమైన మానసిక సమస్యను ఎదుర్కొంటూ, జీవితాలను భారంగా వెళ్లదీస్తున్నారు. వాస్తవానికి ఆటిజం చాలా సాధారణమైన కమ్యూనికేషన్ డిజార్డర్. దాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. అలా అని నిర్లక్ష్యం చేసేదీ కూడా కాదు. ఆడి పాడే వయసులో పిల్లలు ముభావంగా ఉంటున్నారంటే, వారిలో కచ్చితంగా ఆటిజం లక్షణాలున్న ట్టే. ఆటిజం పిల్లల్లో చాలామందికి ఎటువంటి డయాగ్నసిస్ జరగలేదు. వారిలో ఆ లక్షణాలు ఏ మేరకు ఉన్నాయనే అంచనాలు లేవు.
బొమ్మలపై ఆసక్తి
పసిపిల్లలు అకారణంగా ఏడ్వటం, గంటల తరబడి స్తబ్ధుగా ఉండటం, తల్లిదండ్రు లు పిలిచినా ముభావంగా ఉండ డం, తెలిసినవారిని చూసినా నవ్వకపోవడం. బడి వయసు పిల్లలైతే పక్క పిల్లలతో కలవకపోవడం, ఎప్పుడూ ఒంటరిగా ఉండటం, పిలిస్తే పలకకపోవడం కనిపిస్తుంది. మనుషుల కంటే బొమ్మలు, వస్తువుల పట్ల ఆసక్తి చూపడం, అడిగిన వెంటనే జవాబు ఇవ్వలేకపోవడం, సూటిగా చూడలేకపోతుంటారు. స్పష్టమైన భావోద్వేగాలేవీ వ్యక్తం చేయలేరు. మాటలు సరిగా రాకపోవడం, తాము లేదా ఎదుటివారు గాయపడినా పట్టనట్టు ఉంటారు. నడిచేటప్పుడు మునివేళ్ల మీద నడవడం, ఎదుటివా రు అడగకుండానే జవాబు చెప్పటం, అసందర్భంగా మాట్లాడటం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక వస్తు వు లేదా బొమ్మ పట్ల విపరీతమైన వ్యామోహం పెం చుకుంటారు. దాన్ని తీసేస్తే విపరీతంగా కోపం వస్తుం ది. చేతులు, కాళ్లు లేదా వేళ్లు కాస్త అసహజంగా ఒకే తీరులో కదిలిస్తుండటం కనిపిస్తుంది. తాము అడిగినవి ఇవ్వకపోతే అరవడం, కొంతమందిలో ప్రతి దానికీ భయపడటం, గాలికి వస్తువేదైన కదిలిన చూసి భయపడటం, చీమలాంటిది కనపడినా భయపడ టం.. ఇలాంటి పిల్లల్లో ఉంటుంది. చిన్నచిన్న శబ్దాల కూ గట్టిగా చెవులు మూసుకోవడం వంటి భావోద్వేగపరమైన అంశాలూ ఉంటాయి.
పిల్లలపై దృష్టి సారించాలి
ఆటిజం పిల్లలు చేసిన పనే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. విపరీతమైన కోపంతో ఉంటారు. చిరాకు పడుతారు. వస్తువులను చిందరవందర చేసేస్తుంటారు. కొందరికి వచ్చిన మాటలు కూడా పోతుంటాయి. అలాంటి పిల్లల్లో చురుకుదనం తేవాలి. కావలసిన ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. అన్నిటికంటే ముందుగా సమాజంలో ఆటిజం పిల్లల పట్ల వ్యవహరించే ధోరణి మారా లి. ఆటిజంతో బాధపడుతున్నవారు చిన్న వయ స్సు నుంచి కూడా తమ పనులు తాము చేసుకోలేని స్థితిలో ఉంటారు. వారికీ సరైన వైద్య సేవ లందిస్తూ, కాసింత ఎక్కువ శ్రద్ధ చూపించడం ద్వారా వారికీ సాధారణ జీవితాన్ని అందించవచ్చు.
శిక్షణ అవసరం: పిల్లలకు చికిత్స అందిస్తూనే ఆసక్తి కలిగి ఉంటే ఆటిజం పిల్లలతో అద్భుతాలు సృష్టించవచ్చు. పిల్లల్లో భాషాపరమైన ఇబ్బందులు పోగొట్టి స్వేచ్ఛగా మాట్లాడే స్థాయికి తీసుకెళ్లడం, పిల్లల్లో చురుకుదనం తేవాలి. ఆటిజం పిల్లల్లో దాగిన అద్భుత మేధోశక్తిని వెలికితీయడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ వంతు సహకారాన్ని అందించాలి. ఆటిజం పిల్లలకు తగిన మందులు వాడటం, కౌన్సెలింగ్, శిక్షణ ద్వారా మానసిక పరిపక్వతను పెంచ టం, పిల్లలకు తగు ఆహారాన్ని ఇవ్వటం ద్వారా ఆటిజాన్ని అదుపు చేయవచ్చు. సైకోథెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్, ఆక్యుపేషనల్ థెరపీ, ప్లే అండ్ స్టడీ గ్రూప్స్, ఎర్లీ ఇంటర్వెన్షన్ శిక్షణ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ, సైకలాజికల్ కౌన్సెలింగ్, ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లతో మంచి ఫలితం ఉంటుంది.
– డాక్టర్ అట్ల శ్రీనివాస్‌రెడ్డి
97039 35321
(వ్యాసకర్త: రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్, ఫ్యామిలీ కౌన్సెలర్)