Congress Govt | ఏడు నెలల్లోనే దశాబ్దం వెనక్కి
ప్రజాపాలన అని గప్పాలు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుల సమస్యలను పట్టించుకోవడం లేదు. పైగా నిరసనలు చేస్తున్నవారిని ఇష్టారీతిన దుర్భాషలాడుతూ అక్రమ కేసులు పెడుతున్నది. రాజధాని హైదరాబాద్ హత్యలతో అట్టుడుకుతున్నది.
తెలంగాణలో ఎక్కడ చూసినా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలే దర్శనమిస్తున్నాయి. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులతో పాటు వివిధ వర్గాల ప్రజలు తమ తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కుతున్నారు.
Congress Govt | ప్రజాపాలన అని గప్పాలు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుల సమస్యలను పట్టించుకోవడం లేదు. పైగా నిరసనలు చేస్తున్నవారిని ఇష్టారీతిన దుర్భాషలాడుతూ అక్రమ కేసులు పెడుతున్నది. రాజధాని హైదరాబాద్ హత్యలతో అట్టుడుకుతున్నది. శాంతిభద్రతలు కరవవడంతో రాష్ట్ర ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కరెంట్ కోతలు ఎక్కువయ్యాయి. ఫలితంగా తెలంగాణలోని పరిశ్రమలు తరలిపోతున్నాయి. దాంతో ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. అసలు ఏం జరుగుతున్నది మన తెలంగాణలో? ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది.
మోసపూరిత హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏ ప్రభుత్వమైనా కొత్తగా అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తుంది. కానీ, రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. ఒక్క సంక్షేమ పథకాలే కాదు, సాగు, తాగు నీరు, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, కరెంట్, శాంతిభద్రతలు, ఉద్యోగాల కల్పన, విద్య, వైద్య వ్యవస్థ.. ఇలా ఒక్కటేమిటి అన్ని రంగాల్లో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఈ కారణంగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో ఎంతో వెనక్కి వెళ్లింది.
మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, అధికారంలోకి వచ్చి 7 నెలలైనా ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయింది. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి తామే కొలువులు భర్తీ చేశామని గొప్పగా ప్రచారం చేసుకున్నది. వారికి కూడా నాలుగు నెలలుగా జీతాలు లేవు. జీతాల కోసం సీఎం ఇంటి ముందు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. డీఎస్సీ వాయిదా వేయాలని, 1:100 ప్రాతిపదికన గ్రూప్-1 అభ్యర్థులను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు నిరసనలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. అయినా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదు. పైగా నిరసనలు చేస్తున్న నిరుద్యోగ యువతపై అక్రమ కేసులు పెడుతున్నది. కేసీఆర్ హయాంలో ఉన్న ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ నేడు ప్రభుత్వ పెద్దలకు ఫ్రెండ్లీగా మారిపోయింది. నిరసనలను అణచివేస్తూ, అక్రమ కేసులు పెడుతూ, యువతను దుర్భాషలాడుతూ నేడు అదే పోలీస్ వ్యవస్థ తమ లాఠీలకు పని చెప్తున్నది. అంతేకాదు, మీడియా ప్రతినిధులపై కూడా కేసులు పెడుతుండటం దారుణం.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ మళ్లీ ఖాకీ వలయంగా మారుతుందని, ప్రత్యేక బలగాలు ఓయూ చుట్టూ మోహరిస్తారని ఎవరూ ఊహించి ఉండరు. కానీ, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలలకే 2014కు ముందు పరిస్థితులు ఓయూలో సాక్షాత్కారమయ్యాయి. విద్యార్థులతో కోలాహలంగా ఉండే వర్సిటీ పోలీసుల పహరాలోకి వెళ్లిపోయింది. ఎక్కడ, ఎవరూ కనిపించినా వారిని ఠాణాలకు తరలిస్తున్నారు. ఆందోళనకారులపై ఏకంగా దాడులకు తెగబడుతున్నారు. మీడియా ప్రతినిధులను కాలర్ పట్టుకుని లాక్కెళ్లి పోలీస్ జీపులో పడేస్తున్నారు. దోషుల వలె జర్నలిస్టులను హింసిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదు.
పరీక్షలు వాయిదా వేస్తారా, వేయరా? అన్నది ప్రభుత్వం ఇష్టం. కానీ, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపడం నిరుద్యోగుల హక్కు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను పట్టించుకోలేదని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గే పెద్దపెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు. ప్రియాంకాగాంధీ చేతులమీదుగా యూత్ డిక్లరేషన్ కూడా ప్రకటించారు. రాహుల్, ఖర్గే కాంగ్రెస్ మేనిఫెస్టోతో పాటు జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించారు. రాహుల్‌గాంధీ స్వయంగా సెంట్రల్ లైబ్రరీకి వెళ్లి నిరుద్యోగులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఆ హామీలన్ని నీటిమీద రాతలుగా మారాయి.
ఇప్పటికైనా రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలి. పాలనపై దృష్టి సారించాలి. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితమైతే బాగుంటుంది. ఇది అందరి రాష్ట్రం. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం. అనేక పోరాటాలు, త్యాగాలు బలిదానాలతో సాధించుకున్న రాష్ట్రం. పోరాడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో గత పదేండ్ల పాటు అభివృద్ధి పథంలో దూసుకుపోయింది. కేసీఆర్ సర్కార్ వలె ప్రస్తుత ప్రభుత్వం కూడా అభివృద్ధిని పరుగులు పెట్టించాలి. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించాలి. లేకపోతే కొట్లాడి సాధించుకున్న తెలంగాణ అందరి ముందు నవ్వుల పాలవుతుంది. రేవంత్‌కు పాలన అనుభవం లేదు. కనీసం సలహాదారులుగా అనుభవం ఉన్నవాళ్లను పెట్టుకొని తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలి.
– (వ్యాసకర్త: ఆలేరు మాజీ ఎమ్మెల్యే)
– బూడిద బిక్షమయ్య గౌడ్
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

