మేఘం మీద కాలం
కాలం మింగింది మనల్ని ఏ అరణ్యాల మధ్య ఖాళీలో వదిలింది
కాలం మింగింది మనల్ని
ఏ అరణ్యాల మధ్య ఖాళీలో వదిలింది
గుర్తుగా ఒక ఈకను ఉంచి వెళ్లింది
గతం తాలూకు లెక్కలన్నీ కట్టాలి ఇప్పుడు
గడిపిన భారాన్ని తేల్చాలిఇప్పుడు
జ్ఞానసంద్రంలో నీటిమట్టం పెరిగింది
అజ్ఞానపు పలకలు కరిగి
కుప్పలు తెప్పలు పడుతున్నాయి
పక్షుల రెక్కల్లా వలస వచ్చిన మేఘం ఒకటి
నెత్తిన ఆవరించి చేరింది
విద్యుత్తు తరంగాలు నరాలకు తగిన
ఘాతాన్ని ఇస్తాయా
మార్పు ధ్వనులకు ఉరుములను చేరవేస్తూ..
ఇది ఒక రసాయన చర్య
చెత్త నుంచి చెరుకు గడలను తీసే ప్రక్రియ
బంగారుతీగలు అల్లుతూ
ముక్కుతో ఒక ఉష్ణపక్షి తీసుకెళ్తుంది
మోసుకుంటూ సిగ్నల్స్‌ని..
కాలం మళ్లీ విముక్తున్ని చేసే లోపు
ఎప్పుడు వస్తుంది అసలు?
వస్తుందా వెళ్లిందా అయిపోయిందా..
ఇక మిగలకుండా..!!
రఘు వగ్గు
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

