జలకళ మృగ్యమై
చెమ్మగిల్లిన నేత్రాలు మావి
చెమ్మగిల్లిన నేత్రాలు మావి
సొమ్మసిల్లిన దేహాలు మావి
దురదృష్టం కోరలతో రక్తసిక్తులం
దుర్భిక్షం కాటులతో రిక్త అస్తికలం
మా కష్టం సత్యం
మా నష్టం నిత్యం
మా ఇళ్లు దుర్భర స్థితిగతులకు నకళ్లు
మా వాకిళ్లు దయనీయావస్థలకు ఆనవాళ్లు
చదువుల్లేవ్
పదవుల్లేవ్
కంటక కాటక పరిస్థితుల్నెదిరించే
సామర్థ్య కొలువుల్లేవ్
బీళ్ల నేలతో సంసారం
రాళ్ల నేలతో సంపర్కం
ఆకాశం వైపు ఆశల చూపు
పవనాల పయనాలు
అనూహ్యమై అమేయ బలీయమై
నీరు లేక నారు లేక పైరు లేక
వాడు ముఖం పాడు ముఖం గోడు ముఖం
జలకళ మృగ్యమై
జీవకళ అదృశ్యమై
ఎండుడొక్కల ఎడ్లకు మేతలేక
గాదెలు నింపే వడ్లకు రాతలేక
పతనమే పరాకాష్ఠగా
ఉత్థానమే ఉపవిషగా
బతుకు బేజారు
చితికి దరి చేరు
కోటం చంద్రశేఖర్
94920 43348
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

