త్రీ మార్క్స్ తీన్ మార్…
అదిగో అదిగదిగో అంబేద్కర్ చూపిన మార్గంలో పోరాడు సాధించు నిర్దేశంలో ప్రజాస్వామ్య తెలంగాణ సాధించుకుని నివాళిగా నిలువెత్తు విగ్రహము
అదిగో అదిగదిగో
అంబేద్కర్ చూపిన మార్గంలో
పోరాడు సాధించు నిర్దేశంలో
ప్రజాస్వామ్య తెలంగాణ సాధించుకుని
నివాళిగా నిలువెత్తు విగ్రహము
నూట ఇరవై ఐదు అడుగులుగా
నగరం నడిబొడ్డున వెలిసింది
అదిగో రాజ్యాంగం కల్పించిన
సుగంధములు సకల జనులకు
తెలంగాణ ప్రభుత్వం కర్తవ్యంగా
తీరొక్క పథకాలతో ప్రజల చెంతకు
అంబేద్కర్ ఆశయాలు వెలుగులై
అదిగో అదిగదిగో
అమరుల జ్యోతి చూడు
ఆత్మ బలిదానం గర్వంగా
నిత్యం ఆకాశం చూస్తోంది
ఇప్పుడు ప్రతి త్యాగం సాక్ష్యం
తెలంగాణ అభివృద్ది సోపానం
మీ వెలితి పూడ్చ లేనిది
మీ స్మరణ తెలంగాణకు
నిత్య వెలుగు దీపం
అదిగో మీ గుర్తులు మరవనివి
జూన్లో జెండా ఎగిరినప్పుడల్లా
పావురాలై పలకరిస్తారు
అదిగో అదిగదిగో
సచివాలయ భవనం సాక్ష్యం
స్వతంత్ర స్వరాష్ట్ర కీర్తి శిఖరం
తెలంగాణ ప్రజా ప్రతిబింబము
తెల్లని పాలరాతి వైభవం
మందిర్ మసీదు చర్చి సముదాయం
సెక్యులర్ స్ఫూర్తి దేశానికి
ఇంత గొప్ప సందేశం మనసుతో
ఇవ్వబడలేదు ఏ రాష్ట్రం దేశంలో
అదిగో ఇక్కడ ప్రతి గది ప్రతిశాఖ
ప్రజల బాగోగుల కాంక్షగా
తెలంగాణ రాష్ట్ర ప్రతిభ తార్కాణంగా
అదిగో అదిగదిగో
మూడు కట్టడాల తీన్ మార్
తెలంగాణ తల ఎత్తుకునే త్రీ మార్క్స్ ..
-దాసరి మోహన్
99853 09080
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

