ఆకాశమంత అక్షర శిల్పం
అగాధాలలో ఉన్న అక్షర శిల్పాలు ఆకాశమంత ఎత్తులో కనిపిస్తున్నాయి.
అగాధాలలో ఉన్న అక్షర శిల్పాలు
ఆకాశమంత ఎత్తులో కనిపిస్తున్నాయి.
తాటాకుల మీద రాసుకున్న
అసత్య వాక్యాలు చెరిగిపోతున్నాయి.
రాతి గొడ్డలి చేసిన వాడే
శిల్పమూ చెక్కాడు.
చిత్ర లిపి నుండే
లిఖిత భాష ఏర్పడింది.
ఆ పడవ మీద పోయేవారు
నీటి అలల మీద ఎన్నో
రాతలు రాశారు.
ఆకాశం అనేకసార్లు
నది మీద నిద్రిస్తుంది.
నక్షత్రాలకు, చేపలకు చెలిమి.
ఆ చెలిమే చేపల్లో
వెలుగులు చిమ్ముతుంది.
ఆ లాంతరు దీపం
ఎన్ని అక్షరాలకు పురుడు పోసిందో..!
సమాజమంతా అంతర్గతంగా
అనుబంధితమై ఉంది.
ఎవరో ఆ ఎత్తైన
విగ్రహం దగ్గర నిలబడ్డారు.
వారికి ఆ మేధావి అర్థం కాలేదు.
అతని కళ్ళలోకి చూడడానికి
వీళ్ళు భయపడుతున్నారు.
అతని నిశ్శబ్దంలో నుండి
విప్లవాలు పుట్టాయి.
అతన్ని అనేక రంగులతో
కప్పాలని చూశారు.
అతడు నీలి సూర్యునిగా ఉదయించాడు.
అతని అక్షర చిత్రాలకు
ఇంకు నదిగా ప్రవహించింది.
అతడు రాజగృహంలో
లిప్తకాలం నిద్రించలేదు.
మహద్ చెరువు దగ్గర
ఆయన తగలబెట్టిన కాగితాలు
అనేక సంకెళ్లను తెంచాయి.
నిజమే!
అనేక స్మృతులు చెరిగిపోతున్నాయి.
అయితే అతడి స్మృతి
జీవన మార్గం.
ఎందుకు వీరు నల్లధనాన్ని
రొల్లుకుంటున్నారు?
బ్రతికి ఉండగానే మరణిస్తున్నారు.
ఆ ఒక్క అబద్ధం కోసం
అన్ని అచ్చు యంత్రాలు
పని చేయాలా?
వీరి బొమ్మల్లో సొగసు ఏముంది?
అన్నిసార్లు ముద్రించుకుంటున్నారు!
అభద్రతలో వీరి జీవనం
సంక్షుభితం అవుతుంది.
వీరి భోజనపు బల్లపై
రొట్టె ముక్కల్లో ఏమి దాగుందోనని
సంశయిస్తున్నారు.
వీరు విష పాత్రల్లో భుజిస్తున్నారు.
అందుకే మరణం
వీరిని పరిభ్రమిస్తుంది.
అతడు భూమిని
పంచమని చెప్పాడు.
ఎవరు విత్తుతున్నారో
వారిదే పంట అని చెప్పాడు.
అతడు నదులను పంట
పొలాలకు పారించమన్నాడు.
నదుల స్వచ్ఛతే
దేశ సౌభాగ్యత అన్నాడు.
అందుకే మీరు ఆ సూర్యుడిని
మరొకసారి తలెత్తి చూడండి.
ఆ రూపంలో జ్ఞానతత్వం ఉంది!
జీవన సత్యం ఉంది!
బౌద్ధ గమనం ఉంది !
మానవ దర్శనం ఉంది !
నిజాయితీగా జీవించండి.
సత్యమే పలకండి.
నీతిని కిరీటంగా ధరించండి.
మీరు మరణించినా
మళ్లీ లేస్తారు.
అదే ఆయన శిల్ప రహస్యం.
డాక్టర్ కత్తి పద్మారావు
9849741695
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

