Viral Video | తలకిందులుగా కట్టిన ఇల్లు.. వావ్.. సూపర్ అంటున్న పర్యాటకులు
Viral Video | కొలంబియాలో ఓ ఇల్లు స్థానికులను, అక్కడికి వెళ్తున్న పర్యాటకులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ ఇంటిని చూసిన వారంతా ‘‘వావ్.. సూపర్’’ అంటూ ఆ ఇంటి యజమానిని

బొగొటా: కొలంబియాలో ఓ ఇల్లు స్థానికులను, అక్కడికి వెళ్తున్న పర్యాటకులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ ఇంటిని చూసిన వారంతా ‘‘వావ్.. సూపర్’’ అంటూ ఆ ఇంటి యజమానిని ప్రశంసిస్తున్నారు. ఈ ఇంటికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతున్నాయి.
అసలు అంతలా ఆకట్టుకోవడానికి ఈ ఇల్లు ప్రత్యేకతలు ఏంటంటే.. ఈ ఇంటి యజమాని తన ఇంటిని తలకిందులుగా నిర్మించుకున్నాడు. వినడానికి కొంచెం వెరైటీగా ఉన్నప్పటికీ.. ఇది నిజం. అందరిలా కాకుండా తాను వినూత్నంగా ఏదో ఒకటి చేయాలనుకునే ఫ్రిట్జ్ స్కాల్ అనే వ్యక్తి ఈ తలకిందుల ఇంటిని నిర్మించాడు.
ఇలాంటి ఇల్లు ఒకటి కట్టబోతున్నానని తాను ఎంతో మందికి చెప్పగా.. వారంతా తనను పిచ్చివాడిగా చూశారని ఫ్రిట్జ్ చెబుతున్నాడు. ఇప్పుడు అందరూ తన ఇంటి గురించే చర్చించుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నాడు. 2015లో తాను తన మనవళ్లతో కలిసి తన స్వస్థలమైన ఆస్ట్రియాకు వెళ్లానని, అక్కడ ఇటువంటి ఇంటినే తాను చూశానని ఫ్రిట్జ్ చెబుతున్నాడు.
ఆ ఇంటిని చూసిన తరువాతే తాను కూడా తలకిందులుగా ఒక ఇంటిని నిర్మించాలని అనుకున్నట్టు తెలిపాడు. కాగా.. ఈ ఇంటి లోపల ఎలా ఉంటుందో అని ఆసక్తిగా చూసేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. సీలింగ్‌పై నడుస్తూ కింద ఉన్న ఫర్నీచర్‌ను చూడటం వింత అనుభూతని అందరూ అంటున్నారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
- Tags
- houses
- Upside Down
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

