ప్రస్తుతం కొందరు స్కూల్ పిల్లలను చూసిన ఇంటర్నెట్ ఆశ్చర్యపోతోంది. ఆ పిల్లలంతా నింజాలా? అని అడుగుతోంది. దీనికి కారణం ఉందండోయ్. కిండర్‌గార్డెన్‌లో చదువుకునే ఈ చిన్నారులంతా ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాస్‌లో చాలా రిథమిక్‌గా పాల్గొన్నారు. ఈ వీడియోని మాజీ నార్వే దౌత్యవేత్త ఎరిక్ సోల్హైమ్ షేర్ చేశారు.
‘‘వావ్.. కిండర్ గార్డెన్ క్లాస్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్’’ అని దీనికి క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో కొందరు చిన్నారులో రెండు చేతుల్లో రెండు బాస్కెట్ బాల్స్ పట్టుకొని కూర్చొని ఉన్నారు. రెండు చేతులతో వాటిని నేలపై బౌన్స్ చేస్తూ.. కాళ్లను అటూ ఇటూ తిప్పుతూ కనిపిస్తున్నారు.
వీడియో చివర్లో అయితే బంతులు బౌన్స్ చేయడం ఆపకుండానే రెండు కాళ్లూ గాల్లోకి ఎత్తేశారు. ఇది చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. పిల్లలంతా ఒకేలా అలా ఎక్సర్సైజులు చేయడం చూసి ‘‘పిల్ల నింజాలు’’ అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. అందుకే ఒలింపిక్స్‌లో చైనాకు అన్ని మెడల్స్ వస్తున్నాయని ఇంకొందరు అంటున్నారు.
WOW!
Physical education class of kindergarten. 😎😎😎@lsjngs— Erik Solheim (@ErikSolheim) June 5, 2022