బంపర్ ఆఫర్ : వ్యాక్సిన్ వేయించుకున్నవారికి ఉచిత హెయిర్ కట్!

పట్నా : మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగేందుకు ఎవరికి తోచిన రీతిలో వారు సహకరిస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నవారికి ఇప్పటికే పలు సంస్ధలు ఆకర్షణీయ బహుమతులు, రాయితీలు, కూపన్లు అందిస్తుండగా తాజాగా బిహార్‌లోని దర్భంగా జిల్లాలో ఓ సెలూన్ యజమాని కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఉచిత హెయిర్ కట్‌తో పాటు, ఫ్రీగా షేవింగ్ చేస్తున్నాడు. దర్భంగా నగరంలోని బైటా చౌక్‌లో ఉన్న ఈ సెలూన్ యజమాని శంభు కుమార్ ఠాకూర్ చొరవను పలువురు ప్రశంసిస్తున్నారు.
జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రోత్సహించేందుకు తాను ఇలా ఉచిత సర్వీసును ఆఫర్ చేస్తున్నానని ఠాకూర్ చెప్పుకొచ్చారు. వ్యాక్సిన్ తీసుకునే సమయంలో సెల్ఫీ తీసుకున్న వారితో పాటు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపిన వారికి ఉచితంగా సర్వీసు చేస్తున్నానని అన్నారు. ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రచారం చేస్తుండగా తాము కూడా తమకు తోచిన రీతిలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నిర్ణయించుకున్నామన్నారు. తాము ఇప్పటికే 200 మందికి పైగా క్లైంట్లకు ఉచిత సేవలు అందించామని ఠాకూర్ తెలిపారు. సెలూన్ వెలుపల ఉచిత ఆఫర్‌ను తెలిపే బోర్డును సైతం ప్రదర్శిస్తున్నామని చెప్పారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

