రూపర్ట్ ముర్దోక్ నుంచి విడాకులు : కోర్టును ఆశ్రయించిన నాలుగో భార్య జెర్రీ హాల్
మీడియా దిగ్గజం రూపర్ట్ ముర్దోక్ (91) నుంచి నాలుగో భార్య జెర్రీ హాల్ (65) విడాకుల కోసం దరఖాస్తు చేశారు. తమ మధ్య పరిష్కారం కాలేని విభేదాలు తలెత్తడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నానని హాల్ వెల్లడించారు.
వాషింగ్టన్ : మీడియా దిగ్గజం రూపర్ట్ ముర్దోక్ (91) నుంచి నాలుగో భార్య జెర్రీ హాల్ (65) విడాకుల కోసం దరఖాస్తు చేశారు. తమ మధ్య పరిష్కారం కాలేని విభేదాలు తలెత్తడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నానని హాల్ వెల్లడించారు. లాస్ఏంజెల్స్ కౌంటీ కోర్టుల్లో శుక్రవారం ఆమె విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు.
భర్త నుంచి తనకు పరిహారం ఇప్పించాలని దరఖాస్తులో పేర్కొన్న హాల్ ముర్దోక్ మొత్తం ఆస్తుల విలువ వాటి స్వభావం, అప్పులు వంటివి తనకు తెలియదని, ఆ సమాచారం లభ్యమైన తర్వాత పిటిషన్‌ను సవరిస్తామని కోర్టుకు తెలిపారు. మీడియా దిగ్గంజం ముర్దోక్, అలనాటి మోడల్ జెర్రీ హాల్ 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇది ముర్దోక్ నాలుగో పెండ్లి కావడం గమనార్హం. అంతకుముందు ఆయన 1999లో వెండి డాంగ్‌ను వివాహం చేసుకున్నారు.
డాంగ్‌తో 2013 వరకూ ముర్దోక్ కలిసిఉన్నారు. ఇక 1967 నుంచి 1999 వరకూ అన్నా మారియతో వైవాహిక బంధంలో ఉన్నారు. ఇక పట్రిసియ బుకర్‌తో 1956లో ఏడడుగులు వేసిన ముర్దోక్ ఆమెతో 1967 వరకూ కలిసి ఉన్నారు. మోడల్ హాల్ బ్యాట్మన్, ది గ్రాడ్యుయేట్ వంటి సినిమాల్లోనూ మెరిశారు. గతంలో ఆమె రాక్ స్టాక్, సింగర్ మిక్ జాగర్ను పెండ్లి చేసుకున్నారు. వారిద్దరూ తమ వైవాహిక జీవితాల్లో పది మంది సంతానానికి జన్మనిచ్చారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

