ఖాకీ ఖాతాలోకి రూ. 10 కోట్లు..విత్‌డ్రా చేసేందుకు రెడీ అవుతుండగా..!
మనం పొరపాటున ప్యాంట్ జేబులోనో, హ్యాండ్‌బ్యాగ్‌లోనో మరిచిపోయిన రూ 50, రూ 100 కంటపడితేనే సంతోషిస్తాం. ఇక పాకిస్తాన్‌లోని ఓ కానిస్టేబుల్ ఖాతాలో ఏకంగా రూ 10 కోట్లు వచ్చిపడితే అతడి పరిస్ధితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఇస్లామాబాద్ : మనం పొరపాటున ప్యాంట్ జేబులోనో, హ్యాండ్‌బ్యాగ్‌లోనో మరిచిపోయిన రూ 50, రూ 100 కంటపడితేనే సంతోషిస్తాం. ఇక పాకిస్తాన్‌లోని ఓ కానిస్టేబుల్ ఖాతాలో ఏకంగా రూ 10 కోట్లు వచ్చిపడితే అతడి పరిస్ధితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ పోలీస్ స్టేషన్లో విచారణాధికారిగా పనిచేసే అమిర్ గొపాంగ్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.
అతడి బ్యాంక్ ఖాతాలో వేతనంతో పాటు రూ 10 కోట్లు గుర్తుతెలియని సోర్స్ నుంచి క్రెడిట్ అవడంతో అతడు ఓ పట్టాన తేరుకోలేకపోయాడు. తాను అంత పెద్దమొత్తం ఎప్పుడూ చూడకపోవడంతో షాక్ తిన్నానని, తన ఖాతాలో ఎప్పుడూ కొన్ని వేలకు మించి డబ్బు ఉండదని గొపాంగ్ చెప్పాడు. బ్యాంకు అధికారులు తనకు కాల్ చేసి తన ఖాతాలో రూ 10 కోట్లు డిపాజిట్ అయ్యాయని చెప్పడంతోనే తనకు ఈ విషయం తెలిసిందని అన్నాడు.
ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నలోపే బ్యాంక్ అధికారులు గొపాంగ్ ఖాతాను ఫ్రీజ్ చేయడంతో పాటు డబ్బు విత్‌డ్రా చేయకుండా అతడి ఏటీఎం కార్డును బ్లాక్ చేశారు. కరాచీ పోలీస్ ఖాతాలోకి ఇంత పెద్దమొత్తం ఎక్కడినుంచి ఎలా వచ్చిపడిందో తెలసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇక గతంలోనూ పాక్‌లోని లర్కన, సుక్కూర్ ప్రాంతాల్లోని పోలీసుల ఖాతాల్లో పెద్దమొత్తంలో డబ్బు క్రెడిట్ అయిన ఘటనలు జరిగాయి.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు రేవంత్ రెడ్డి.. వీడియో
ప్రతి ఇంటికి ఇంకుడుగుంతను నిర్మించుకోవాలి : డీఎల్పీవో సుధీర్‌కుమార్
KTR | సివిల్స్ విద్యార్థిని కోల సింధు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
గాంధీనగర్‌లో అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ
Alcohol | అల్లరి నరేశ్ ‘ఆల్కహాల్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. డిసెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

