Budget 2022 | రీఫార్మ్స్ ఎఫెక్ట్.. బడ్జెట్ స్పీచ్‌లకు పెరిగిన ప్రాధాన్యం.!
Budget 2022 | నెహ్రూ హయాంలో ప్రణాళికాబద్దంగా తొలి బడ్జెట్ రూపుదిద్దుకుంటే.. మన్మోహన్ సింగ్ 1991లో లైసెన్స్ రాజ్‌కు తిలోదకాలిచ్చారు.

Budget 2022 | 75 ఏండ్ల గణతంత్ర భారతావనిలో ప్రతియేటా వార్షిక బడ్జెట్లు ప్రవేశ పెట్టడం సంప్రదాయం. ఆయా మంత్రులు తమ వెసులుబాటును బట్టి సుదీర్ఘంగా, అతి స్వల్ప ప్రసంగాలతో ముగించారు. ఇలా మన దేశ వార్షిక బడ్జెట్లకూ ఓ హిస్టరీ ఉంది. 1950-51లో తొలి ప్రధాని పండిట్ నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్న ప్రణాళికా సంఘం కనుసన్నల్లో తొలి ఆర్థిక మంత్రి జాన్ మథాయి బడ్జెట్ ప్రసంగాన్ని రూపొందించారు. కానీ 1991-92లో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సంస్కరణల మాంత్రికుడు మన్మోహన్ సింగ్ ఆ సంప్రదాయానికి చరమగీతం పాడారు.
పది మంది ఆర్థిక మంత్రులు 54 బడ్జెట్లు
ఆర్థిక మంత్రులంతా విభిన్న వ్యక్తిత్వం ఉన్న వారే. 1951 నుంచి ఇప్పటి వరకు 54 బడ్జెట్లను పది మంది ఆర్థిక మంత్రులు ప్రవేశపెట్టారు. సీడీ దేశ్‌ముఖ్ 1951-57 మధ్య ఐదు, మొరార్జీ దేశాయ్ (1959-64, 1967-70), వైబీ చవాన్ (1971-75), వీపీ సింగ్ (1985-87), మన్మోహన్ సింగ్ (1991-96), యశ్వంత్ సిన్హా (1998-2004), పీ చిదంబరం (1996-98, 2004-09, 2013-14), ప్రణబ్ ముఖర్జీ (1982-85, 2009-13), అరుణ్ జైట్లీ (2014-19) మధ్య బడ్జెట్లు ప్రవేశపెట్టారు. 2019-20 నుంచి ఇప్పటివరకు మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. 2022-23 ఆర్థిక సంవత్సరానికి నాలుగో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కసరత్తు చేపట్టారు.
సుదీర్ఘంగా మన్మోహన్ తొలి బడ్జెట్ స్పీచ్
1991లో మన్మోహన్ సింగ్ తొలి బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘంగా సాగింది. సుమారు 18,700 పదాలతో మన్మోహన్ సంస్కరణల సమ్మోహన ప్రసంగం సాగితే, తర్వాత సగటున యశ్వంత్ సిన్హా సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. ఆయన ప్రసంగం నిడివి 15,700 పదాలు మాత్రమే. ఇందిరాగాంధీ సగటున అతి తక్కువ పదాలతో ప్రసంగం ముగించేవారు. మొరార్జీ దేశాయి పది వేల పదాలతో ప్రసంగాన్ని రూపొందించుకుంటే వైబీ చవాన్ 9,300 పదాలతో బడ్జెట్ ప్రసంగం తయారు చేసుకున్నారు.
చతురోక్తుల ప్రసంగాలకు ప్రాముఖ్యం
1991లో దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరణల బాట పట్టించిన తర్వాతే బడ్జెట్ ప్రసంగాలకు ప్రాముఖ్యం ఏర్పడింది. ఆయా బడ్జెట్ ప్రసంగాలు కూడా చతురోక్తులతో సుదీర్ఘంగా సాగాయి. ప్రస్తుతం విత్తమంత్రిగా నిర్మలా సీతారామన్ తొలిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో 2019 జూలైలో 11 వేల పదాలతో బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు.
వారి స్పీచ్‌లు చాలా సంక్లిష్టం..
యశ్వంత్ సిన్హా, అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగాలు చాలా సంక్లిష్టంగా ఉండేవి. దేశ్ ముఖ్ (62), దేశాయి (61) బడ్జెట్ ప్రసంగాలు ఇంతకుముందు వాటికంటే సమగ్రంగా ఉండేవి. టైంతోపాటు ఆర్థిక మంత్రులు తమ ప్రసంగాలను మార్చేసుకునేవారంటే అతిశయోక్తి కాదు. 1950వ దశకంలో కరువు నుంచి రికవరీ దిశగా భారత్ అడుగులేస్తున్న సమయంలో దేశ్‌ముఖ్ బడ్జెట్ ప్రసంగాల్లో ఆహార కొరత, అధిక ధరలు, విదేశీ చెల్లింపులు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చేవి.
నెహ్రూ టైంలో ప్రణాళిక.. 91′ తర్వాత మార్కెట్లు
నెహ్రూ హయాంలో ‘ప్రణాళికఅన్న అంశం ఆధిపత్యం వహించేది. లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్యం సాగేది. సరళీకృత విధానాలు అమలులోకి వచ్చాక మార్కెట్ల పెరుగుదల ప్రస్తావనకు వచ్చేది. కానీ ఇటీవలి కాలంలో ‘స్టేట్ అనే పదం తిరిగి వచ్చి చేరింది.
2004 తర్వాత వ్యవసాయానికి ప్రాధాన్యం
గ్రామీణ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ప్రతి బడ్జెట్ ప్రసంగంలోనూ ఎవర్ గ్రీన్ గా ఉండేది. కానీ 2004లో వాజపేయి సారథ్యంలోని ఎన్డీఏ సర్కార్ విఫలమైన తర్వాత వ్యవసాయ రంగంపైనే ప్రధానంగా ఆర్థిక మంత్రులు బడ్జెట్లను కేంద్రీకరించి రూపొందించేవారు. 1998-2004 మధ్య పట్టణాభివృద్ధి కేంద్రంగా ద్రృష్టిని కేంద్రీకరించి బడ్జెట్లు రూపొందించారన్న విమర్శలు ఉన్నాయి.
21వ శతాబ్దిలో పట్టణీకరణ.. టెక్నాలజీ
వ్యవసాయరంగంతోపాటు పేదరికం, హ్యూమన్ క్యాపిటల్ (హెల్త్, విద్య, పారిశుద్ధ్యం) పదాలు ప్రణబ్‌ముఖర్జీ, పీ చిదంబరం, అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగాల్లో ప్రస్తావనకు వచ్చేవి. పర్యావరణం, టెక్నాలజీ, లింగం, పట్టణ అంశాలు 21వ శతాబ్ధి బడ్జెట్ ప్రసంగాల్లో సర్వ సాధారణం అయ్యాయి.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

