దూర ప్రయాణాలు చేయాలంటే చాలామంది ప్రిఫర్ చేసేది ట్రెయిన్ జర్నీనే. రైలు జర్నీ అయితేనే కంఫర్ట్‌గా ఉంటుందని ట్రెయిన్ టికెట్స్ బుక్ చేసుకుంటారు. కానీ.. చాలామంది ప్రయాణికులకు తాము ఆశించిన బెర్త్‌లు కన్ఫమ్ కావు. కొందరికి లోయర్ బెర్త్ అంటే ఇష్టం ఉంటుంది. కానీ.. అందరికీ లోయర్ బెర్త్‌లు బుక్ కావు. కొందరికి మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్, సైడ్ బెర్త్‌లు బుక్ అవుతుంటాయి. యూత్ లాంటి వాళ్లకు ఏ బెర్త్ అయినా ఓకే కానీ.. సీనియర్ సిటిజన్స్ అంటే వృద్ధులకు మిడిల్, అప్పర్ బెర్త్ అంటే కష్టమే. మరి.. వాళ్లకు లోయర్ బెర్త్ ఖచ్చితంగా కన్ఫమ్ అయ్యేలా సీట్లు బుక్ చేసుకోవచ్చు. దాని కోసం చిన్న ట్రిక్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
నిజానికి.. సీనియర్ సిటిజన్స్ కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేకంగా కొన్ని ఫెసిలిటీలను కల్పిస్తోంది. సీనియర్ సిటిజన్స్‌కు లోయర్ బెర్త్‌ను కన్ఫమ్గా బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. దీనికి సంబంధించి ఓ ప్రయాణికుడు ట్విట్టర్లో అడిగిన ప్రశ్నకు ఇండియన్ రైల్వేస్ నుంచి రిప్లయి వచ్చింది.
లోయర్ బెర్త్ సీటు కన్ఫమ్ కావాలంటే.. పురుషులు అయితే 60 ఏళ్లు పైబడి ఉండాలి. స్త్రీలు అయితే 45 ఏళ్లు పైబడి ఉండాలి. ఇద్దరు కానీ.. ఒక్కరు కానీ.. ఒకే టికెట్ మీద ప్రయాణిస్తే.. అప్పుడు వాళ్లకు లోయర్ బెర్త్‌లు ఖచ్చితంగా కన్ఫమ్ అవుతాయని రైల్వేస్ రిప్లయి ఇచ్చింది.
అంటే.. టికెట్ బుక్ చేసేటప్పుడు సీనియర్ సిటిజన్స్ వయసును ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే లోయర్ టికెట్స్ బుక్ అవుతాయి. ఈ ట్రిక్ తెలుసుకుంటే.. సీనియర్ సిటిజన్స్‌కు ఎప్పుడైనా లోయర్ టికెట్ బుక్ చేయొచ్చు. అలాగే.. సీనియర్ సిటిజన్స్ కోసమే అన్ని రైళ్లలో రైల్వే శాఖ కొన్ని టికెట్లను ప్రత్యేకంగా కేటాయించింది. అవి కేవలం వాళ్లకే బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
న్యూస్ చానెల్లో వెదర్ రిపోర్ట్ చదువుతుండగా స్క్రీన్‌పై అశ్లీల వీడియో ప్రత్యక్షం!
Bullet Doctor : బుల్లెట్ బండి డాక్టర్.. ఈయన స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Driverless bike : డ్రైవర్‌లెస్ బైక్ వచ్చేసింది.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో చూశారా?
విమానం నుంచి పడిపోయిన మానవ వ్యర్థాలు.. షాకైన తోట యజమాని
పురాతన ఆయుధం : మధ్యదరా సముద్రంలో 900 ఏండ్ల నాటి కత్తి లభ్యం!