Menkes Syndrome : మృత్యువు అంచుల్లో కన్నకొడుకు.. తండ్రి చేసిన పనికి ప్రపంచమే నివ్వెరపోయింది
మృత్యువు అంచుల్లో కన్నకొడుకు | తల్లి నవమాసాలు మాత్రమే తన బిడ్డను కడుపులో మోస్తుంది. కానీ.. ఆ బిడ్డ పుట్టాక.. జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటాడు తండ్రి.
తల్లి నవమాసాలు మాత్రమే తన బిడ్డను కడుపులో మోస్తుంది. కానీ.. ఆ బిడ్డ పుట్టాక.. జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటాడు తండ్రి. తన బిడ్డకు చిన్న గాయం అయినా తట్టుకోలేడు. అదే తండ్రి ప్రేమ అంటే. తన పిల్లల కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు తండ్రి. ఈ తండ్రి కూడా అంతే. మృత్యువు అంచుల్లో ఉన్న కన్న కొడుకు ప్రాణాలను కాపాడటం కోసం.. తనే డాక్టర్‌గా మారాడు. కన్న కొడుకును బతికించుకోవడం కోసం ఏకంగా ల్యాబ్‌నే ఏర్పాటు చేసి.. మెడిసిన్ తయారు చేశాడు.

చైనాలోని కన్మింగ్కు చెందిన క్సు వీయ్కి రెండేళ్ల కొడుకు ఉన్నాడు. అ పిల్లాడి పేరు హవోయాంగ్. పుట్టడమే అరుదైన వ్యాధితో జన్మించాడు హవోయాంగ్. జన్యుపరంగా వచ్చే వ్యాధి అది. దాని పేరు మెంకాస్ సిండ్రోమ్ (Menkes Syndrome).
ఈ వ్యాధి వల్ల మెదడు, నాడి వ్యవస్థ ఎదుగుదల ఆగిపోతుంది. ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే ఆ పిల్లాడికి కావాల్సిన కాపర్‌ను అందించాలి. కాపర్ డెఫిషియెన్సీ వల్ల రోజు రోజుకూ ఆ బాలుడి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇప్పటి వరకు మెడిసిన్ మీద ఎలాగోలా రెండేళ్ల పాటు హవోయాంగ్ను కాపాడుకుంటూ వచ్చాడు వీయ్.

కానీ.. ఇంకో రెండు నెలల కంటే ఎక్కువ బతకడు.. అని డాక్టర్లు కన్ఫమ్ చేశారు. ఎందుకంటే.. ఇక ఆ బాలుడికి ఇవ్వాల్సిన మెడిసిన్ చైనాలో ఎక్కడా దొరకదట. ఒకవేళ వేరే దేశాలకు వెళ్దామన్నా.. కరోనా ఆంక్షల వల్ల.. దేశం దాటలేకపోయాడు వీయ్. దీంతో ఏం చేయాలో అర్థం కాక.. తన కొడుకును కాపాడుకోవడం కోసం తన ఇంట్లోనే ల్యాబ్ ఏర్పాటు చేసి.. ఆ వ్యాధికి మెడిసిన్ తయారు చేయడం మొదలు పెట్టాడు.
డాక్టర్ విద్య చదవకున్నా.. ఆన్లైన్లో రీసెర్చ్ చేసి
నిజానికి వీయ్ చదివిది పాఠశాల విద్యే. ఆ తర్వాత చదువు మానేసి.. ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆన్‌లైన్‌ను నమ్ముకొని ఇంటర్నెట్లో ఆ వ్యాధి గురించి.. దానికి సంబంధించిన మెడిసిన్ గురించి రీసెర్చ్ చేశాడు. ఆ సమయంలో తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ తనను వ్యతిరేకించారు. చివరకు మెడిసిన్ తయారు చేశాడు.
రోజూ ఒక డోస్
తను తయారు చేసిన మెడిసిన్‌ను ముందు కుందేళ్ల మీద ప్రయోగించాడు. ఆ తర్వాత తన మీదనే ప్రయోగించుకున్నాడు వీయ్. కుందేళ్లకు, తనకు ఏం కాలేదు. దీంతో తన కొడుకుకు ఆ మెడిసిన్‌ను ఇవ్వడం ప్రారంభించాడు. ఆ మెడిసిన్ ద్వారా.. ఆ బాలుడి ఒంట్లో లేని కాపర్‌ను అందించి.. మెదడు, నాడి వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తున్నాడు. కానీ.. ఆ మెడిసిన్ ఆ వ్యాధిని పూర్తిగా నయం చేయలేదు.

అయితే.. వీయ్ తయారు చేసిన మెడిసిన్ గురించి చైనా మొత్తం మారుమోగిపోయింది. దీంతో పలువురు డాక్టర్లు, పరిశోధకులు వీయ్ మెడిసిన్‌కు మద్దతుగా నిలిచారు. వెక్టర్ బిల్డర్ అనే అంతర్జాతీయ బయోటెక్ ల్యాబ్.. వీయ్ మెడిసిన్‌కు ఇంప్రెస్ అయింది. తనతో పాటు పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. తన కొడుకుకు ఉన్న అరుదైన వ్యాధి కోసం మెడిసిన్ తయారు చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని వీయ్కు హామీ ఇచ్చింది.
ఆ అరుదైన వ్యాధి గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం.. దానికి సరైన మందును కనిపెట్టడం కోసం వీయ్.. యూనివర్సిటీలో మాలెక్యులర్ బయాలజీ చదివేందుకు కూడా సిద్ధపడ్డాడు. నా కొడుకును కాపాడుకోవడం కోసం ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటాను. నా కొడుకును ఎలాగైనా మృత్యువు నుంచి కాపాడుకుంటాను. అతడు మృత్యువు కోసం ఎదురు చూడకూడదు. అతడిలో జీవితం మీద ఆశ కలిగిస్తాను..అంటూ శపథం చేశాడు వీయ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
స్టెరిలైజింగ్ క్యూర్.. హెచ్ఐవీ నుంచి కోలుకున్న 30 ఏళ్ల మహిళ.. ఎలా సాధ్యమైంది ?
Whistle village : ఆ ఊళ్లో పేర్లు ఉండవ్.. విజిల్‌తోనే పిలుచుకుంటరు
భార్య పుట్టినరోజును మరిచిపోతే.. అక్కడ జైలుకు వెళ్లాల్సిందే.. శిక్ష అనుభవించాల్సిందే
TajMahal Lookalike | భార్య కోసం తాజ్‌మహల్ వంటి భవనం కట్టిన భర్త.. ఎక్కడంటే
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

