TCA | టొరంటోలో అంబరాన్నంటిన ఉగాది సంబురాలు..
కెనడాలోని గ్రేటర్ టొరంటోలో ఉగాది పండుగను (Ugadi Celebrations) ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ సంబురాలలో 1500 మందికిపైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు.
టొరంటో: కెనడాలోని గ్రేటర్ టొరంటోలో ఉగాది పండుగను (Ugadi Celebrations) ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ సంబురాలలో 1500 మందికిపైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. గుప్తేశ్వరి వాసుపిల్లి, సరిత ప్యారసాని, ప్రసన్న గుజ్జుల, భవాని సామల, విజయ చిత్తలూరి జ్యోతి ప్రజ్వలన చేయగా,గుప్తేశ్వరి వాసుపిల్లి గణేష వందనంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ పూజారి నరసింహ చారి పంచాంగ శ్రవణం చేశారు.
స్థానిక చిన్నారులతో ప్రవీణ్ నీలా దర్శకత్వంలో రచించబడిన కృష్ణం వందే జగద్గురుం నాటిక ప్రేక్షకులను మనోరింజింపజేసింది. అలాగే మనబడి చిన్నారులు ప్రదర్శించిన బుర్రకథకు విశేషాదరణ లభించింది. వీరితోపాటు పలువురు పెద్దలు, చిన్నారులు సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. మొత్తం 87 మంది 25 వినూత్నమైన ప్రదర్శనలతో 4 గంటలపాటు ఆహుతులను అలరింపజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ కెనడా సంఘం అధికారిక తెలుగు పత్రిక ‘టీసీఏ ఉగాది సంచిక’ ను ఎన్‌సీపీఎల్ అధినేత రాంబాబు వాసుపిల్లి ఆవిష్కరించి పాలకమండలి సభ్యులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాతృభాషని ప్రోత్సహిస్తున్న తెలంగాణ కెనడా సంఘం వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మాతృభాష ప్రాముఖ్యతను భావితరాలకు అందజేయడానికే ఈ సంచికను తీసుకొచ్చామని తెలంగాణ కెనడా సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి ఉపాధ్యక్షుడు మనోజ్ రెడ్డి, కార్యదర్శి శంతన్ నారెళ్లపల్లి, రాజేష్ అర్ర, స్ఫూర్తి కొప్పు, కుమారి ప్రహళిక మ్యాకల, వేణుగోపాల్ ఏళ్ళ, నాగేశ్వరరావు దలువాయి, ప్రణీత్ పాలడుగు, శంకర్ భరద్వాజ పోపూరి, ప్రవీణ్ కుమార్ శ్యామల, భగీరథ దాస్ అర్గుల, నవీన్ ఆకుల, మాధురి చాతరాజు, అతిక్ పాషా, దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, హరి రాహుల్, కలీముద్దీన్ మొహమ్మద్, శ్రీనివాస తిరునగరి, ప్రకాష్ చిట్యాల, రాజేశ్వర్ ఈద, ప్రభాకర్ కంబాలపల్లి, విజయ్ కుమార్ తిరుమలపురం పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ram Charan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రామ్ చరణ్ – సుకుమార్ RC17 రిలీజ్ డేట్ ఫిక్స్?
Road Accident | దైవ దర్శనానికి వెళ్తూ యాక్సిడెంట్.. 13 మంది మృతి
Ramayana | సీత పాత్రపై విమర్శలు.. నెగిటివిటీపై లేడీ పవర్‌స్టార్ అదిరిపోయే సమాధానం!
IND vs NZ | బుమ్రా దెబ్బకు లాథమ్ ఔట్.. టీ బ్రేక్‌కు కివీస్ స్కోర్ ఇదే
Bigg Boss 10 | వర్షిణి కన్నీళ్లు.. అమన్, ముఖేష్‌లకు నాగార్జున గట్టి క్లాస్,త్రిగుణ్‌కు షాక్!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

