NRI | లండన్‌లో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు
లండన్ : ఎన్నారై టీఆర్ఎస్ సెల్ – యూకే ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు లండన్‌లో ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ వాదులు హాజరయ్యారు. ముందుగా పార్టీ జెండాను అశోక్ గౌడ్ ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. జయశంకర్ సార్‌కు నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. 20001లో ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందన్నారు. సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని ప్రశంసించారు. ఎన్నారైలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు వచ్చి పార్టీ గెలుపునకు కృషి చేస్తామని ప్రవాస తెలంగాణ వాదులు తెలిపారు.
కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, సంయుక్త కార్యదర్శులు మల్లా రెడ్డి, రమేష్ ఇస్సంపల్లి, అధికార ప్రతినిధులు రవి కుమార్ రేతినేని, రవి ప్రదీప్ పులుసు, లండన్ ఇంచార్జి నవీన్ భువనగిరి, నవీన్ మాదిరెడ్డి, ఈస్ట్ లండన్ ఇంచార్జి ప్రశాంత్ కటికనేని, మధు ఆబోతు, ప్రవాస తెలంగాణ వాదులు మట్టా రెడ్డి , గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- Ashok Goud Doosari
- london
- Nri
- TRS
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

