ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం : అశోక్ గౌడ్ దూసరి
హైదరాబాద్ : ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి ఎమ్మెల్సీ కవితపై నిరాధారణమైన ఆరోపణలు చేయడమే కాకుండా, ఆమె ఇంటిపై దాడికి పాల్పడ్డ బీజేపీ నేతల చర్యలను ఎన్నారై టీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు.
రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ము లేకనే బీజేపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తుందన్నారు. ఇలాంటి నిరాధార ఆరోపణలతో ప్రజల్లో బీజేపీ మరింత చులకనవుతుందని అశోక్ తెలిపారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలకు కేసీఆర్ బెదిరే నాయకుడు కాదని, ఎంతో మందితో పోరాడి తెలంగాణ సాధించిన ఫైటర్ అని గుర్తు చేశారు. బీజేపీ నాయకులు చిల్లర వేషాలు ఇప్పటికైనా ఆపకుంటే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ది చెప్తారని అశోక్ తేల్చిచెప్పారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

