టెక్సాస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD) DFW తెలుగు సంఘం ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం వెలుపల అతిపెద్ద బతుకమ్మను నిర్వహించినందుకు తెలంగాణ ప్రభుత్వంచే జాతీయస్థాయి గుర్తింపు పొందింది. అంతేగాక టెక్సాస్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన కమ్యూనిటీ సంస్థగా ఎదిగింది. ఈ సంస్థ తాజాగా తన 10వ ఎగ్జిక్యూటివ్ కమిటీకి నూతన సభ్యులను ఎన్నుకుంది. టెక్సాస్లోని ఫ్రిస్కోలోగల శుభం బాంక్వెట్ హాల్లో నూతన సభ్యుల ప్రమాణస్వీకారం జరిగింది.
విఘ్నేశ్వరుడికి దీపం వెలిగించడం ద్వారా ఈ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రమాణస్వీకారోత్సవానికి ముందు స్థానిక సంగీత ఉపాధ్యాయురాలు, గాయని సమీర శ్రీప్దాద గీతాలాపన చేశారు. అనంతరం TPAD బృందం అమెరికా, భారత్ జాతీయ గీతాలను ఆలపించారు. కార్యక్రమ నిర్వాహకులు లక్ష్మీ పోరెడ్డి.. TPAD ఏర్పాటు, చరిత్ర, అనేక సంవత్సరాలుగా నిర్వహించిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల గురించి వివరించారు. FC చైర్ రఘువీర్ బండారు, BOT చైర్ సుధాకర్ కలసాని, ప్రెసిడెంట్ లింగారెడ్డి అల్వా, BOT వైస్ చైర్ గోలి బుచ్చిరెడ్డి, కో ఆర్డినేటర్ రోజా ఆదెపు సహా టీమ్ కొత్త సభ్యులందరితో ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా రఘువీర్ బండారు, సుధాకర్ కలసాని, లింగారెడ్డి ఆళ్వా, గోలి బుచ్చిరెడ్డి, ఆదెపు రోజా, కార్యదర్శి రత్న ఉప్పల, ఉపాధ్యక్షురాలు అనురాధ మేకల మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన టీమ్ బ్లడ్ డ్రైవ్లు, ఫుడ్ డ్రైవ్లు, తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, బతుకమ్మ, దసరా సంబురాల నిర్వహణలో పోటీతత్వంతో పనిచేస్తుందన్నారు. ఔట్ గోయింగ్ ఫౌండేషన్ కమిటీ చైర్ అజయ్ రెడ్డి మాట్లాడుతూ.. టీపీఏడీ తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించడమేగాక, టీమ్ సభ్యుల నాయకత్వ నైపుణ్యాల మెరుగు కోసం వేదికను కూడా అందించిందన్నారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీ: లింగారెడ్డి అళ్వా (అధ్యక్షుడు), అనురాధ మేకల (వైస్ ప్రెసిడెంట్), రమణ లష్కర్ (పాస్ట్ ప్రెసిడెంట్), రత్న ఉప్పల, శ్రీనివాస్ అన్నమనేని, రూప కన్నయ్యగారి, మాధవి లోకిరెడ్డి, లక్ష్మీ పోరెడ్డి, మధుమతి వైశ్యరాజు, శ్రీధర్ వేముల, బాల గణపవరపు, స్వప్న తుమ్మపాల, స్వప్న, రేణుకా చనమోలు, గాయత్రి బుషిగంపాల, శంకర్ పరిమళ్.
ధర్మకర్తల మండలి: సుధాకర్ కలసాని, గోలి బుచ్చి రెడ్డి, రోజా ఆదెపు, ఇంద్రాణి పంచెరూపుల, పాండు రంగారెడ్డి పాల్వాయి, మాధవి సుంకిరెడ్డి, పవన్ గంగాధర, అశోక్ కొండల, రామ్ అన్నాడి, రాజ్ గోంధి, రవికాంత్ మామిడి, రాంపాల్ గడ్డం, సత్య పెరికరి.
ఫౌండేషన్ కమిటీ: రఘువీర్ బండారు, మహేందర్ కామిరెడ్డి, రావు కల్వల, అజయ్ రెడ్డి, జానకిరామ్ మందడి, ఉపేందర్ తెలుగు, రాజ్ గోంధీ.