11న ఉగాండాలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు
Kaloji | ఉగాండాలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఉగండా, ఇండియాలోని డాక్టర్ సినారె - వంశీ విజ్ఞాన పీఠం

హైదరాబాద్ : ఉగాండాలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఉగండా, ఇండియాలోని డాక్టర్ సినారె – వంశీ విజ్ఞాన పీఠం సహకారంతో ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికి శాఖ, 5 ఖండాల్లోని తెలుగు సంస్థల అభినందనలతో కాళోజీ 107వ జయంతి, తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఉగాండా అధ్యక్షులు పార్థసారథి వెల్దుర్తి తెలిపారు. ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవం నిర్వహిస్తున్న విషయం విదితమే.
అంతర్జాలం వేదికగా నిర్వహించే ఈ వేడుకల్లో కాళోజీ పురస్కారాలు అందుకున్న డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్, గోరటి వెంకన్న, డాక్టర్ ఆర్ సీతారాం, డాక్టర్ అంపశయ్య నవీన్, కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి, ప్రొఫెసర్ రమా చంద్రమౌళి, డాక్టర్ పెన్నా శివరామకృష్ణ పాల్గొని ప్రసంగించనున్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, డాట్ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ బీ వేణుగోపాలరావు, కళాబ్రహ్మ శిరోమణి డాక్టర్ వంశీరామరాజు, డాక్టర్ జే చెన్నయ్య, కాళోజీ రవికుమార్, కాళోజీ సంతోష్, నాగిళ్ల రామశాస్త్రి, డాక్టర్ వ్యాసకృష్ణ బూర్గుపల్లి పాల్గొననున్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

