దక్షిణాఫ్రికాలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
దక్షిణాఫ్రికాలోని తెలంగాణ ప్రవాస భారతీయులు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. జోహానెస్‌బర్గ్ నగరంలోని మిడ్రాండ్లోని Dream Hill International schoolలో జరిగిన ఈవేడుకకు, తెలంగాణ వాసులే కాకుండా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రవాస భారతీయులు, అక్కడి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
జోహానెస్‌బర్గ్, జూన్ 1: దక్షిణాఫ్రికాలోని తెలంగాణ ప్రవాస భారతీయులు తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. జోహానెస్‌బర్గ్ నగరంలోని మిడ్రాండ్లోని Dream Hill International schoolలో జరిగిన ఈవేడుకకు, తెలంగాణ వాసులే కాకుండా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రవాస భారతీయులు, అక్కడి స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా(TASA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిబింబంగా పిల్లలు నృత్యాలు, పాటలతో అలరించారు.
ఈ సందర్భంగా, TASA కమిటీ, తన నూతన కార్యవర్గ బృందాన్ని ఏర్పాటు చేసింది. TASA అధ్యక్షులుగా మురళి బండారు, ఉపాధ్యక్షులుగా సీతారామరాజు రాప్రోలు, ప్రధాన కార్యదర్శిగా రతన్ శేర్ల, కోశాధికారిగా ప్రవీణ్ కొప్పుల, చైర్మన్‌గా సుబ్బారావు కష్టాల, వైస్ చైర్మన్‌గా రజిని పడాల, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్స్ గా చందు బీరవల్లి, శ్రీకాంత్ గోవింద్, అవినాష్ రెడ్డి, కౌముది వేముల, లావణ్య తాళ్ళపల్లి, ఇతర కార్యవర్గ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భారతీయ కాన్సులేట్ జనరల్ సభ్యులు హరీశ్ కుమార్ గారు మాట్లాడుతూ.. “తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రజల ఆశయాలకు, అభివృద్ధికి కొత్త దిశలు తెరుచుకున్నాయి. ఇలాంటి సంబరాలు ఇతర దేశాల్లో జరగడం గర్వకారణం” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటైన కార్యవర్గ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Tasa1
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా నూతన అధ్యక్షుడు, మురళి బండారు మాట్లాడుతూ.. ” ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. ఇది మా మట్టికి మనం ఇచ్చే గౌరవానికి నిదర్శనం. తెలంగాణ సమైక్యతకు, సాంస్కృతిక విలువలకు ఇదే ఉదాహరణ” అని తెలిపారు. అలాగే ఈ ఏడాది బతుకమ్మ వేడుకలను 27 సెప్టెంబర్ నాడు చాలా ఘనంగా జరుపుకోబోతున్నాం అని, ప్రవాస భారతీయులు అందరూ వచ్చి, బతుకమ్మ వేడుకలో పాల్గొనాల్సిందిగా కోరడం జరిగింది.
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలంగాణ ప్రజలు తమ మూలాలను, సంస్కృతిని మరిచిపోకుండా ప్రతి ఏడాది ఇలా జరుపుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయం అని ప్రవాసులంతా పేర్కొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

