మలేషియాలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు..
తెలంగాణ (Telangana) రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మలేషియాలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావించి పదేండ్లు పూర్తి చేసుకొని పదకొండో ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మలేషియా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకొన్నారు.
హైదరాబాద్: తెలంగాణ (Telangana) రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మలేషియాలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావించి పదేండ్లు పూర్తి చేసుకొని పదకొండో ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మలేషియా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మలేషియా ఎన్నారై శాఖ అధ్యక్షుడు మారుతి కుర్మ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో మలిదశ ఉద్యమం మొదలు, తెలంగాణ సాధన, అభివృద్ధి, నాడు మనం అనుభవించిన కష్టాలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాధనకై అమరుల ప్రాణత్యాగాలను ఎన్నడూ మరవలేమని వారికి నివాళులు అర్పించి కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో చిన్నారులు ఆటపాటలతో అలరించారు.

తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో కేంద్రంలో కూడా బీఆర్ఎస్ను అధికారంలోకి వచ్చి అన్నిరంగాల్లో అభివృద్ధిని సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మలేషియా ఫౌండర్ చిరుత చిట్టిబాబు, ఉపాధ్యక్షులు మునిగల అరుణ్, కార్యదర్శి, కోర్ కమిటీ సభ్యులు సందీప్ కుమార్ లగిశెట్టి, బొడ్డు తిరుపతి, గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సత్యనారాయణరావ్ నడిపెల్లి, హరీష్ గుడిపాటి, శ్యామ్, పూర్ణ చందర్ రావు, కిషోర్, క్రాంతి , విజయ్ పాల్గొన్నారు.



Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train Derail | అస్సాంలో పట్టాలు తప్పిన కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్.. పలువురికి గాయాలు..!
Toxic | ‘టాక్సిక్’ వివాదంలో కియారా అద్వానీకి భర్త సిద్ధార్థ్ మల్హోత్రా అండ.. ట్రోలర్లకు గట్టి సమాధానం!
Hyderabad Accident | రాంగ్ రూట్లో వచ్చిన ఎస్బీఐ ఉద్యోగి.. బస్సు కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
Goat | `ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుడిగాలి సుధీర్‌కు దివ్యభారతి షాక్.. హీరో పేరు ప్రస్తావించకుండానే స్పీచ్!
AP News | రూ.500 తిరిగి ఇవ్వలేదని.. వ్యక్తిపై మరిగే నూనె పోసిన మహిళ.. నెల్లూరులో దారుణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

