Vijayawada – Singapore | విజయవాడ నుంచి సింగపూర్‌కు డైరెక్ట్ విమాన సర్వీసులు.. హర్షం వ్యక్తం చేసిన శ్రీ సాంస్కృతిక కళాసారథి
Vijayawada - Singapore | విజయవాడ నుంచి సింగపూర్‌కు నవంబర్ 15వ తేదీ నుంచి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడికి శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
Vijayawada – Singapore | విజయవాడ నుంచి సింగపూర్‌కు నవంబర్ 15వ తేదీ నుంచి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడికి శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఇటీవల సింగపూర్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు నాయుడు ప్రవాస తెలుగువారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా త్వరలోనే సింగపూర్ నుంచి విజయవాడకు డైరెక్ట్ సర్వీసులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రెండు నెలల్లోనే విమాన సర్వీసులను ప్రారంభిస్తుండటం పట్ల రత్నకుమార్ కవుటూరు హర్షం వ్యక్తం చేశారు.
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ సౌకర్యం తెలుగు ప్రవాస భారతీయులకు విశేష ప్రయోజనం కలిగించడమే కాకుండా వ్యాపార, సాంస్కృతిక బంధాలను మరింత బలపరుస్తుందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ విమానయాన పటంలో గౌరవప్రదంగా నిలబెట్టే మైలురాయిగా నిలుస్తుందన్నారు. సింగపూర్‌లోని తెలుగువారికి మరిన్ని అవకాశాలు కల్పించేలా వైమానిక అనుసంధానాన్ని విస్తరించేందుకు మీరు చేపడుతున్న ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

