శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో సింగపూర్ కార్తీకమాస స్వరారాధన
పవిత్ర కార్తీక మాసం సందర్భంగా "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ శనివారం నాడు ఆన్లైన్లో "కార్తీకమాస స్వరారాధన" అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించింది.
పవిత్ర కార్తీక మాసం సందర్భంగా “శ్రీ సాంస్కృతిక కళాసారథి” సంస్థ శనివారం నాడు ఆన్లైన్లో “కార్తీకమాస స్వరారాధన” అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత అయిన డా. అద్దంకి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్తీకమాస వైశిష్ట్యం గురించిన వివిధ అంశాలను ఒక చక్కటి ప్రవచనంగా అందించారు. పోలండ్ దేశస్తుడైన యువ గాయకుడు (Zach)బుజ్జి పాత తెలుగు సినిమాలలోని ఘంటసాల పాడిన శివ భక్తిగీతాలను, శివతాండవ స్తోత్రాన్ని పాడి వినిపించడం అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించింది.
ఈ సందర్భంగా శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ.. “డా. అద్దంకి శ్రీనివాస్ తమ సంస్థ కార్యక్రమంలో తొలిసారి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. సింగపూర్ గాయనీగాయకులతో పాటుగా మాతృభాష తెలుగు కాని ఒక విదేశీయుడైన బాలుడు చక్కగా తెలుగు భక్తి పాటలు నేర్చుకొని పాడటం అభినందనీయమని కొనియాడారు.
కార్తీకమాసంలో వచ్చే వివిధ పర్వదినాల గురించి ఆయా రోజులలో ఆచరించే పూజలు, వాటి వెనుక ఉన్న కథలు, ప్రత్యేకతలు, కారణాల గురించి డా. అద్దంకి శ్రీనివాస్ ఈ సందర్భంగా సోదాహరణంగా విశ్లేషిస్తూ వివరించారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా, అన్ని వయసుల వారికి అర్థమయ్యే విధంగా సులభమైన భాషలో తెలియజేశారు.
సంస్థ ప్రధాన నిర్వహకవర్గ సభ్యురాలు రాధిక మంగిపూడి సభా సమన్వయం చేయగా, సుబ్బు వి పాలకుర్తి సహ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సింగపూర్ గాయనీగాయకులు విద్యాధరి కాపవరపు, సౌభాగ్యలక్ష్మి తంగిరాల, శేషుకుమారి యడవల్లి, షర్మిల చిత్రాడ, స్నిగ్ధ ఆకుండి, శ్రీవాణి, చంద్రహాస్ ఆనంద్, హరి మానస శివ భక్తిగీతాలను ఆలపించారు. వాటిలో త్యాగరాజ కృతులు వంటి సంప్రదాయ సంగీతం, శివపదం గీతాలు, చలనచిత్ర గీతాలు, లలిత గీతాలు కూడా ఉండటం విశేషం.
కల్చరల్ టీవీ సాంకేతిక సహకారంతో ప్రపంచవ్యాప్తంగా ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమం అన్నిదేశాల తెలుగు ప్రజల మన్ననలు అందుకుంది.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

