NRI news | బీఆర్ఎస్ను ఎదుర్కోలేక ఈడీని ఉసిగొల్పిన బీజేపీ: బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల
బీఆర్ఎస్ను ఎదుర్కోలేకే బీజేపీ (BJP) కుట్రలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ (BRS) ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి (Kasarla Nagender reddy) అన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ను ఎదుర్కోలేకే బీజేపీ (BJP) కుట్రలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ (BRS) ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి (Kasarla Nagender reddy) అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును (Women’s Reservation Bill ) పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో దీక్షకు పూనుకున్న ఒకరోజు ముందే విచారణకు రావాలని ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) బీజేపీ జేబు సంస్థ అయిన ఈడీ నోటీసులు జారీచేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. దీనిద్వారా కవిత దీక్షను భగ్నం చేయాలన్న ఆ పార్టీ కుట్ర బహిర్గతమవుతున్నదన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను, విశిష్టతను ఖండాంతరాలకు వ్యాప్తిచెందేలా భారత జాగృతి అధ్యక్షురాలు కవిత కృషిచేశారని వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ లాంటి పట్టణాల్లో, విదేశాల్లో ఆత్మన్యూనతకు గురైన బతుకమ్మ పండుగను.. నేడు అధికారికంగా నిర్వహించేస్థాయికి తీసుకొచ్చారని తెలిపారు.
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిష్టించే దాకా అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించారని గుర్తుచేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దేశవ్యాప్తంగా మహిళలను ఐక్యంచేసి ఢిల్లీ వేదికగా జంతర్‌మంతర్‌లో ధర్నాకు ఉపక్రమించిన నేపథ్యంలో.. ఆమె దీక్షకు భయపడిన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈడీని ఉసిగొల్పిందని విమర్శించారు. అయినా ఎవ్వరికీ తలవంచని తెలంగాణ బిడ్డ కవిత దీక్షను విజయవంతంగా పూర్తిచేసి మహిళా రిజర్వేషన్ బిల్లును సాధిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

