మలేషియా : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. ఆడబిడ్డలు ఎంతో ఎంతో వేడుకగా జరుపకునే బతుకమ్మ వేడుకల సందర్భంగా మలేషియాలో ‘మలేషియా తెలంగాణ అసోసియేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదారి కిషోర్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా మలేషియాలో ఇంత ఘనంగా బతుకమ్మ సంబరాలను జరుపుతున్న సభ్యులను అభినందించారు. మలేషియా టీఆర్ఎస్ అధ్యక్షుడు చిరుత చిట్టిబాబు ఆధ్వర్యంలో జరిపిన వివిధ కార్యక్రమాలను కొనియాడారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ల విషయంలో టీఆర్ఎస్ మలేషియా చూపిన చొరవను అభినందించారు.
కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మారుతి కుర్మ, కార్యదర్శి సందీప్ కుమార్ లగిశెట్టి, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొడ్డు తిరుపతి, గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సత్యనారాయణ రావు నడిపెల్లి, నవీన్ గౌడ్ పంజాల, హరీష్ గుడిపాటి, రవీందర్ రెడ్డి, శ్యామ్, సంపత్ రెడ్డి, పూర్ణ చందర్ రావు, కిషోర్ పాల్గొన్నారు.