Huzurabad | గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో 50 దేశాల ఎన్నారైల సమావేశం
ఎన్నారై | ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో టీఆర్ఎస్ ఎన్నారై శాఖల కోఆర్డినేటర్ మహేష్ బిగాల వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు.

హైదరాబాద్ : హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థికి దేశ విదేశాల నుంచి వివిధ వర్గాల నుంచి రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. హుజురాబాద్ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా గెల్లుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో టీఆర్ఎస్ ఎన్నారై శాఖల కోఆర్డినేటర్ మహేష్ బిగాల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పల్లా రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ..ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నారైలు హుజురాబాద్‌లో ఉన్న బంధువులకు, మిత్రులు, శ్రేయోభిలాషులతో మాట్లాడి గెల్లు అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు. మంచి మెజారిటీ తో గెలిపించాలని ఆకాంక్షించారు .
గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ మలి దశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నానని తెలిపారు. 2001 నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా కీలకపాత్ర పోషించాను.
ఈ కార్యక్రమాన్ని అన్ని దేశాల ప్రతినిధులతో నిర్వహించినందుకు అన్ని దేశాల ప్రతినిధులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.
మహేష్ బిగాల మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందన్నారు. మా ఎన్నారై అన్ని శాఖలు ఈ ఎన్నికల్లో వాళ్లకు సోషల్ మీడియా, టెలిఫోనిక్ కాంపెయిన్, ప్రత్యక్షంగా పాల్గొనడం ఇలా వారికి తోచిన విధంగా సహకరిస్తామన్నారు. కార్యక్రమములో ఎన్నారై ప్రతినిధులు అనిల్ కూర్మాచలంతో పాటు వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. వారు గెల్లుకు తమ సంపూర్ణ మద్దతును తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

