Gurrala Nagaraju | దక్షిణాఫ్రికాలో తెలంగాణ బిడ్డకు అరుదైన గౌరవం.. ‘వింటర్ హీరో’గా గుర్రాల నాగరాజు ఎంపిక
Gurrala Nagaraju | తెలంగాణ బిడ్డ గుర్రాల నాగరాజు గత 18 సంవత్సరాలుగా దక్షిణాఫ్రికాలో స్థిరపడి, సమాజ సేవలో నిబద్ధతతో పని చేస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
Gurrala Nagaraju | దక్షిణాఫ్రికాలో ప్రముఖ బ్రాండ్ అయిన ‘Halls’సంస్థ సామాజిక సేవలో విశేష కృషి చేస్తున్న వ్యక్తులను గుర్తిస్తూ దేశవ్యాప్తంగా కొంతమందిని ‘Winter Heroes’గా ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తిగా తెలంగాణ బిడ్డ గుర్రాల నాగరాజు చోటు దక్కించుకోవడం తెలుగు ప్రజలకు గర్వకారణంగా నిలిచింది.
గత 18 సంవత్సరాలుగా దక్షిణాఫ్రికాలో స్థిరపడి, సమాజ సేవలో నిబద్ధతతో పని చేస్తూ నాగరాజు అనేక సేవా కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో వేలాది మందికి ఆహార సహాయం అందించడం, అత్యవసర పరిస్థితుల్లో తెలుగు ప్రజలకు సహాయం చేయడం, పేదలు, అనాథలు, మానసిక వికలాంగులకు చేయూతనివ్వడం వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
దక్షిణాఫ్రికాలో భారతీయ, తెలుగు సమాజ అభివృద్ధి కోసం కమ్యూనిటీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఎవరికి ఏ అవసరం వచ్చినా ముందుండి స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారు. మహిళల సాధికారత కోసం మహిళా కిట్ల పంపిణీ, పోలీస్ స్టేషన్లలో బ్లాంకెట్ డ్రైవ్‌లు, సీఎం రిలీఫ్ ఫండ్‌కు సహాయ కార్యక్రమాలు, అవయవ దానంపై అవగాహన కార్యక్రమాలు వంటి అనేక కార్యక్రమాల్లో ఆయన భాగస్వామ్యం అందించారు.
ప్రస్తుతం ‘JNS Cloud Solutions’ సంస్థ వ్యవస్థాపకుడిగా, అలాగే ‘Uplift A Child South Africa Director’గా సేవలందిస్తూ సాంకేతిక రంగంలోనూ, సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. హాల్స్ సంస్థ అందించిన ‘Winter Hero’గుర్తింపు కేవలం వ్యక్తిగత గౌరవం మాత్రమే కాకుండా విదేశాల్లో తెలంగాణ పేరు ప్రతిష్టలను చాటుతున్న ప్రతి తెలుగు వ్యక్తికి దక్కిన గౌరవంగా భావిస్తున్నారు.
జగిత్యాల నేల నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు అంతర్జాతీయ స్థాయిలో సేవా స్పూర్తికి ప్రతీకగా నిలవడం తెలంగాణ యువతకు స్ఫూర్తిదాయకం. విద్య, కృషి, సేవాభావం ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా గుర్తింపు సాధించవచ్చని గుర్రాల నాగరాజు మరోసారి నిరూపించారు.
Read Also :
Illegal Activities | సీపీ సుమతి రంగంలోకి దిగినా.. యథేచ్చగా అసాంఘీక కార్యకలాపాలు.. వీడియో
డిమాండ్ నోటీసుల పంపిణీపై నల్లగొండ కమిషనర్ ఆకస్మిక తనిఖీ
తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు : గొంగిడి సునితామహేందర్ రెడ్డి
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

