ఘనంగా దేవులపల్లి కృష్ణ శాస్త్రి జయంతి
ఎన్నారై | శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్, వంశీ - శుభోదయం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో భావకవితా పితామహుడు పద్మ భూషణ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి 124 జయంతిని అంతర్జాల వేదికగా ఘనంగా నిర్వహించారు.

హైదరాబాద్ : శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్, వంశీ – శుభోదయం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో భావకవితా పితామహుడు పద్మ భూషణ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి 124 జయంతిని అంతర్జాల వేదికగా ఘనంగా నిర్వహించారు. సుమారు 7 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో సింగపూర్, అమెరికా, భారతదేశం నుంచి అతిథులు, వక్తలు, గాయనీమణులు పాల్గొన్నారు.
వంశీ ఆర్ట్ థియేటర్స్ స్వర్ణోత్సవ వసంత ప్రచురణగా 17 దేశాల నుంచి 250 మంది కవయిత్రులు రచించిన కవితలతో రూపొందింపబడిన ‘కవితా మేఘమాల’ అనే కవితా సంకలనాన్ని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అలనాటి ప్రముఖ నటీమణి జమునా రమణారావు, దేవులపల్లి సినిమా పాటలను తలచుకుంటూ ప్రసంగించారు. గౌరవ అతిథిగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య ఆవుల మంజులత విచ్చేసి కవితా సంకలనాన్ని సమీక్షించారు.
రాధిక మంగిపూడి వ్యాఖ్యాన నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో శుభోదయం సంస్థ నిర్వాహకులు కలపటపు లక్ష్మీ ప్రసాద్, దేవులపల్లి వారి కుటుంబ సభ్యులు లలితారామ్, రత్నపాప, సీతా రత్నాకర్, శారద తదితరులు, 12 మంది ప్రముఖ వక్తలు, 8 మంది ప్రసిద్ధ గాయనీమణులు పాల్గొన్నారు.
శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ..సింగపూర్ నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలగడం తమ అదృష్టమన్నారు. వంశీ అధ్యక్షుడు రామరాజు మాట్లాడుతూ..దేవులపల్లి ఫౌండేషన్ అధ్యక్షురాలు లలిత రామ్ అందించిన ఆర్థిక సహకారంతో, కవితా మేఘమాల సంకలనాన్ని ప్రచురించామని, దానికి కారకులైన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

శారద అశోకవర్ధన్, డా. బాలాంత్రపు లావణ్య, డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య, డా. రామసూరి, డా. దామరాజు కామేశ్వరరావు, సుబ్బు వి పాలకుర్తి, యస్ వేణుగోపాల రెడ్డి, శ్రీదేవి లేళ్ళపల్లి, రామనాథ్ ,చంద్ర రెంటచింతల, డా. నిడమర్తి నిర్మలా దేవి, డా. వైదేహి శశిధర్ దేవులపల్లి వారిని గూర్చిన చక్కటి పరిశోధనాత్మక ప్రసంగాలను అందించారు.
వేదవతి ప్రభాకర్, దివాకర్ల సురేఖ మూర్తి, వేదాల శశికళ స్వామి, యస్ పి వసంత, హిమబిందు,
శాంతిశ్రీ, కుమారి శ్రేయ రామనాథ్, ధర్మరాజు వంశీప్రియ కృష్ణశాస్త్రి రచించిన పాటలను అద్భుతంగా ఆలపించి అలరించారు.

సింగపూర్ నుంచి గణేశ్న రాధాకృష్ణ సాంకేతిక సమన్వయంతో ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. దాదాపు 3వేల మంది ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్, ఫేస్బుక్ ద్వారా చూసారని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని క్రింది వీడియోలో చూడవచ్చు.



Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

