సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ నూతన అధ్యక్షుడిగా గడప రమేశ్‌బాబు
TCSS | సింగపూర్‌లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ (TCSS) నూతన కార్యవర్గాన్ని ఎనుకున్నది. సింగపూర్‌లోని ఆర్య సమాజ్‌లో తొమ్మిదో వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా
హైదరాబాద్: సింగపూర్‌లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ (TCSS) నూతన కార్యవర్గాన్ని ఎనుకున్నది. సింగపూర్‌లోని ఆర్య సమాజ్‌లో తొమ్మిదో వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా టీసీఎస్ఎస్ నూతన అధ్యక్షుడిగా గడప రమేశ్‌బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీసీఎస్ఎస్ కార్యవర్గానికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో రమేశ్ బాబు ప్యానల్ మినహా మరెవరూ పోటీలో నిలబడలేదు. దీంతో గడప రమేశ్ బాబు ప్యానల్ ఏకకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు వినయ్ కుమార్, ముద్రకోల నవీన్ ప్రకటించారు.

ఈ సందర్భంగా గడప రమేశ్ బాబు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ వాసులకు సేవ చేసే అవకాశం లభించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నీలం మహేందర్, సొసైటీ సంస్థాగత అధ్యక్షుడు బండా మాధవ రెడ్డి, గర్రెపల్లి శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్ చెన్నోజ్వల, గార్లపాటి లక్ష్మారెడ్డి, కొల్లూరి శ్రీధర్, గింజల సురేందర్ రెడ్డి, వినయ్ కుమార్ పెద్దపల్లి తదితరులు పాల్గొన్నారు.

టీసీఎస్ఎస్ నూతన కార్యవర్గం
అధ్యక్షుడిగా గడప రమేష్ బాబు ఎన్నికవగా, ప్రధాన కార్యదర్శిగా బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారిగా జూలూరి సంతోష్ కుమార్, సంస్థాగత కార్యదర్శిగా కాసర్ల శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులుగా నల్ల భాస్కర్ గుప్త, గోనె నరేందర్ రెడ్డి, మిర్యాల సునీత రెడ్డి, దుర్గ ప్రసాద్ మంగలి, ప్రాంతీయ కార్యదర్శులుగా నంగునూరి వెంకట రమణ, బొండుగుల రాము, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజ్జాపూర్, కార్యవర్గ సభ్యులుగా పెరుకు శివరామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, బొడ్ల రోజారమణి, శివ ప్రసాద్ ఆవుల, శశిధర్ రెడ్డి, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, రాధికా రెడ్డి, సదానందం అందె, రవి చైతణ్య మైసా, విజయ మోహన్ వెంగళ ఎన్నికయ్యారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

