Dubai ETCA | దుబాయ్‌లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
Dubai ETCA | ETCA ఆధ్వర్యంలో అక్టోబర్ 11, 2026న దుబాయ్‌లోని షబాబ్ అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహించిన 16వ బతుకమ్మ వేడుకల్లో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, గౌరీదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..” అంటూ ఆలపించిన పాటలు వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.
Dubai ETCA | దుబాయ్ : ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో అక్టోబర్ 11, 2026న దుబాయ్‌లోని షబాబ్ అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహించిన 16వ బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో 6,000 మందికి పైగా తెలంగాణ ప్రవాసులు పాల్గొని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని ఘనంగా చాటారు. ఈ కార్యక్రమానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ముఖ్య అతిథులుగా, దుబాయ్ కాన్సుల్ జనరల్ డాక్టర్ ఇమ్మడి విష్ణు వర్ధన్ రెడ్డి గౌరవ అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, గణేష్ బిగాల, షకీల్ అమీర్, సురేందర్ జాజల, BRS ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల తదితర ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.
మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, గౌరీదేవికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సంప్రదాయ బతుకమ్మ పాటలు, కోలాటాలు, నృత్యాలతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది. “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..” అంటూ మహిళలు ఆలపించిన పాటలు వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.
ప్రముఖ సినీ, జానపద గాయని మధుప్రియ తన ప్రత్యేక ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. మాట్ల తిరుపతి, డాక్టర్ కోకిల నాగరాజు, అంజలి పులింతి తదితరుల ఆటపాటలు వేడుకలకు మరింత వైభవాన్ని తీసుకొచ్చాయి. తన్మయి ఆర్ట్ స్టూడియో నాట్య గురువు ప్రీతి తాటంబోట్ల పర్యవేక్షణలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. హాజరైన వారందరికీ నిర్వాహకులు ఉచిత భోజనం, బతుకమ్మ ప్రసాదం అందించారు.
2011 నుంచి నిరంతరంగా బతుకమ్మ వేడుకలు..
ఈ సందర్భంగా ETCA వ్యవస్థాపకుడు పీచర కిరణ్ కుమార్, అధ్యక్షుడు చీటీ జగదీశ్ రావు మాట్లాడుతూ.. ‘2011 నుంచి యూఏఈ గడ్డపై బతుకమ్మ వేడుకలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాం. కొద్దిమందితో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు వేలాది మంది తెలంగాణ ప్రవాసులు పాల్గొనే భారీ సాంస్కృతిక వేడుకగా ఎదిగింది. విదేశీ గడ్డపై మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతోపాటు, యూఏఈలో పుట్టి పెరుగుతున్న మన పిల్లలకు తెలంగాణ వారసత్వాన్ని పరిచయం చేయడం మా ప్రధాన లక్ష్యం’ అని తెలిపారు.
తెలంగాణ ప్రజల ఐక్యతను పెంపొందించడం, సంస్కృతి సంప్రదాయాలను కాపాడటం, ఆపదలో ఉన్న ప్రవాస తెలంగాణీయులకు సహాయం అందించడం ETCA ప్రధాన ఉద్దేశాలని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలోనూ సంఘం అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి బాధితులకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. వేడుకలను విజయవంతం చేసిన స్పాన్సర్లు, కళాకారులు, మహిళా విభాగం, కార్యవర్గ సభ్యులు, వాలంటీర్లు, తెలంగాణ కుటుంబాలు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.
సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కళాఖండం..
తెలంగాణ చేనేత కళా వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పే ప్రత్యేక కళాఖండం ఈ వేడుకల్లో మరో విశేషంగా నిలిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ వెండి పట్టు దారాలతో ముగ్గురు పాలకుల ముఖచిత్రాలను చేనేత వస్త్రంపై అద్భుతంగా రూపొందించారు. సుమారు 2 మీటర్ల పొడవున్న ఈ కళాఖండం తయారీలో 26 గ్రాముల వెండిని వినియోగించారు. ప్రత్యేక డిజైన్ రూపకల్పనకు సుమారు 15 రోజులు పట్టగా, మగ్గంపై నేయడానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టిందని కళాకారుడు తెలిపారు. దుబాయ్ పాలకునికి అందించేందుకు రూపొందించిన ఈ కళాఖండం సిరిసిల్ల చేనేత కళాకారుల ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. ఈ కళాఖండాన్ని ETCA ప్రతినిధులు దుబాయ్ పాలక కుటుంబానికి అందించనున్నారు.
ETCA కార్యవర్గ సభ్యుల భాగస్వామ్యం..
ఈ కార్యక్రమంలో ETCA కార్యవర్గ సభ్యులు పీచర కిరణ్ కుమార్, చీటీ జగదీశ్ రావు, రాణి కోట్ల, అలిగేటి శ్రీనివాస్, గుండవేని శేఖర్, తిరుమల రావు బీరెల్లి, రాధారపు సత్యం, మామిడి శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, సాయి చందర్, సురేష్ రెడ్డి, రఘు అలిగేటి, వినోద్ ఆచార్యులు, ఎస్.పీ. కస్తూరి, సంతోష్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, సారిక, మమత, సరోజ, రణీశ, మౌనిక, రాజేష్, కార్తీక్ రెడ్డి, రమణ, మధు కుమార్, రణధీర్, రవి చంద్ర తదితరులు పాల్గొన్నారు.
ETCA 16వ బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు ప్రవాస తెలంగాణీయుల ఐక్యత, ఆత్మీయత, సేవాభావానికి ప్రతీకగా నిలిచాయి.




Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dubai ETCA | దుబాయ్‌లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
Rahul Gandhi | ఇండియా బ్లాక్ పార్టీలకు హైటీ ఏర్పాటు చేసిన రాహుల్.. సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరుపై చర్చ
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

