Decade Celebrations | ఒమన్‌లో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు..జాగృతి, బీఆర్ఎస్ ఎన్నారై శాఖల ఆధ్వర్యంలో రక్తదానం
Decade Celebrations | తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఒమన్ దేశ రాజధాని మస్కట్‌లోని ఘలాలో ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఒమన్ దేశ రాజధాని మస్కట్‌లోని ఘలాలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ రాయల్ హాస్పిటల్ లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో భారత జాగృతి, బీఆర్ఎస్ ఎన్నారై సెల్ శాఖల ఆధ్వర్యంలో రక్తదాన(Blood Donations) శిబిరం ఏర్పాటు చేశారు.

ఈ శిబిరంలో తెలంగాణ(Telangana), రాజస్థాన్(Rajasthan), ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు రక్తదానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల(Decade Celebrations )ను ఉత్సాహంగా నిర్వహించారు.
భారత జాగృతి(Jagruthi) ఒమాన్ శాఖ అధ్యక్షుడు గుండు రాజేందర్ నేత, బీఆర్ఎస్(BRS) ఎన్ఆర్ఐ సెల్ ఒమాన్ అధ్యక్షుడు ఈగపురి మహిపాల్ రెడ్డి, భారత్ జాగృతి ఒమాన్ కో కన్వీనర్ బైసింగరపు వినోద్ యాదవ్, బీఆర్ఎస్ ఒమాన్ ప్రధాన కార్యదర్శులు గాంధారి నరేష్, భాస్కర్ రెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ రామరాజు, కరుణాకర్ పాల్గొన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో కార్యదర్శులు సాయి రాజు, రాజేందర్, వంశీ, రంజిత్,ప్రమోద్ రెడ్డి, విజయ్,మెడ పట్ల లక్ష్మణ్ ,జగన్,కొయ్యాడి వంశీ ,మంత్రి గోపాల్ ,రంజిత్ కశామొల్ల,కొమురయ్య,వేణు,రాజు, నరేష్ ,రాజేందర్,రంజిత్,శ్రీనివాస్ నేత,అక్తర్,జంబుకా శ్రీనివాస్,గంగాధర్,ప్రదీప్,సుమన్,నాగరాజు,అశోక్ తదితరులు పాల్గొని రక్తదానం చేశారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

