brs switzerland | ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న దాడులు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం (ఏప్రిల్ 4, 2026) జరిగిన విధ్వంసకాండ ప్రజాస్వామ్య విలువలకు తీరని అవమానమని బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గందె శ్రీధర్ అన్నారు. ఈ ఘటనను బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ విభాగం అత్యంత తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.
ఘటన వివరాలు వివిధ మీడియా కథనాల ప్రకారం, భారీ సంఖ్యలో అధికార పార్టీ కార్యకర్తలు శనివారం గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి అనధికారంగా ప్రవేశించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చిత్రపటాన్ని కార్యాలయంలో అనుమతి లేకుండా ఉంచినట్లు సమాచారం. అంతేకాకుండా, కార్యాలయంలోని ఫర్నీచర్, కిటికీ అద్దాలు, తలుపులు ధ్వంసమైనట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటన సందర్భంగా రేకెత్తించిన నినాదాలు ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమైనవిగా భావిస్తున్నాం.
ప్రజాస్వామ్య విలువలకు భంగం..
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రభుత్వ ఆస్తి. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి కార్యాలయంలో ఇటువంటి ఘటనలు జరగడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన, దశాబ్దకాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన, ప్రస్తుత ప్రతిపక్ష నేత కార్యాలయంలో ఇటువంటి ఘటనలు జరగడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించే అంశమన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్థాయి నాయకుడి కార్యాలయానికి తగిన భద్రత కల్పించలేని పరిస్థితి ఆందోళనకరం. ఇటువంటి సంఘటనలు సామాన్య పౌరుల భద్రతపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతాయి.
సమగ్ర దర్యాప్తు అవసరం..
ఈ ఘటన వెనుక ఉన్న అన్ని కోణాలను సమగ్రంగా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉందని గందె శ్రీధర్ అభిప్రాయపడ్డారు. ఈ ఘటనకు ప్రేరేపించిన, ప్రోత్సహించిన వారి బాధ్యతను కూడా నిర్ణయించాలి. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఈ ఘటనకు సంబంధించి లేవనెత్తిన ఆరోపణలను కూడా దర్యాప్తులో భాగంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాం.
మా విజ్ఞప్తులు..
1. చట్టపరమైన చర్యలు: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విధ్వంసానికి బాధ్యులైన వారిని చట్టప్రకారం గుర్తించి, తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
2. ప్రభుత్వ ఆస్తి పరిరక్షణ: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రభుత్వ ఆస్తి కావున, దీనిని ధ్వంసం చేసిన వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలి.
3. సమగ్ర దర్యాప్తు: ఈ ఘటన వెనుక ఉన్న పూర్వాపరాలను, బాధ్యతను నిర్ధారించేందుకు నిష్పక్షపాత దర్యాప్తు జరపాలి.
4. ప్రతిపక్ష నేతలకు తగిన భద్రత: ప్రతిపక్ష నేతల కార్యాలయాలకు తగిన భద్రత ఏర్పాట్లు చేయాలి.
5. పునరావృతం కాకుండా నివారణ చర్యలు: ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన నివారణ చర్యలు తీసుకోవాలి.
ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ..
రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, హింసకు, విధ్వంసానికి దిగడం ప్రజాస్వామ్య సమాజంలో ఆమోదయోగ్యం కాదని బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గందె శ్రీధర్ అన్నారు . ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల కార్యాలయాలపై ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు భంగకరం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది త్యాగాలు చేశారు. ఆ ఆశయాలను గౌరవించడం మనందరి బాధ్యత. భారత రాష్ట్ర సమితి ఏ ఒత్తిళ్లకైనా ధైర్యంగా ఎదురొడ్డుతుంది. ప్రజాస్వామ్య మార్గంలో ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుంది. రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడేందుకు చట్టపరమైన అన్ని మార్గాలను అనుసరిస్తుందన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి తెలంగాణ పౌరుడి బాధ్యత. ఈ ఘటనపై తగిన చట్టపరమైన చర్యలు జరగాలని మనవి చేస్తున్నాం. ఈ ఘటనపై సంబంధిత అధికారులు సత్వరం స్పందించి, న్యాయమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ విభాగం కోరుతోందన్నారు.
Shah Rukh Khan | కింగ్ ఖాన్ హాలీవుడ్ ఎంట్రీ?.. ‘ది వైట్ లోటస్’ వెబ్ సిరీస్లో షారూఖ్.!
Watch: పొలంలో కూలిన యూఏవీ.. తర్వాత ఏం జరిగిందంటే?
Sara Arjun | 1300 మందిని ఆడిషన్స్ చేశారట.. ధురంధర్లో సారా అర్జున్ ఎలా ఫైనల్ అయిందంటే..?