మ్యూనిచ్: తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బతుకమ్మ వేడుకలను జర్మనీలోని మ్యూనిచ్‌లో (Munich) కన్నుపండువగా నిర్వహించారు. బతుకమ్మ పాటలతో పరిసరాలు మార్మోగాయి. ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది ఉయ్యాల పాటలు పాడారు. ఈ వేడుకల్లో సుమారు 200 మందికి పైగా ఎన్నారై మహిళలు పాల్గొన్నారు.
జర్మనీలోనూ బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని నిర్వాహకులు అరవింద్, నరేష్, శ్రీనివాస్, వికాస్, సుజిత్, మహేష్, దేవేందర్, శివ, గిరీష్, రమేష్, అనిల్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో స్థిరపడిన తెలంగాణ, తెలుగు వాళ్లు కూడా బతుకమ్మ సంబురాలను ఘనంగ నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. మ్యూనిచ్‌లో జరిగిన బతుకమ్మ సంబురాలు జర్మనీలోని ఇతర నగరాలకు స్ఫూర్తినిచ్చాయని చెప్పారు.