NRI | కెనడా-టొరంటోలో ఘనంగా సద్దుల బతుకమ్మ, దసరా సంబురాలు
NRI | తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో టొరంటో నగరంలోని తెలంగాణ ప్రాంత వాసులు బతుకమ్మ(Bathukamma) సంబురాలను అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాల్లో 3500కు పైగా తెలంగాణ వాసులు స్థానిక ఆనాపిలిస్ హాల్- మిస్సిసాగాలో పాల్గొని బతుకమ్మ పండుగను విజయవంతం చేశారు. శిల్పా చందా, శ్రీదేవి కల్లేపల్లి,సమత కాకర్ల,వైదేహి భగత్ అన్నపూర్ణ జ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు.
కెనడా : తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో టొరంటో నగరంలోని తెలంగాణ ప్రాంత వాసులు బతుకమ్మ(Bathukamma) సంబురాలను అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాల్లో 3500కు పైగా తెలంగాణ వాసులు స్థానిక ఆనాపిలిస్ హాల్- మిస్సిసాగాలో పాల్గొని బతుకమ్మ పండుగను విజయవంతం చేశారు.
శిల్పా చందా, శ్రీదేవి కల్లేపల్లి,సమత కాకర్ల,వైదేహి భగత్ అన్నపూర్ణ జ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఈవెంట్ స్పాన్సర్ గా Get-Home Realty వ్యవహరించినవారిని తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మన్నెం శాలువాలతో అభినందించి TCA మొమెంటోస్ బహుకరించారు.
అధికారిక తెలుగు పత్రిక TCA బతుకమ్మ సంచికను విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ సంబరాలపై వారికి ఉన్న భక్తిశ్రద్ధలను కొనియాడారు. ఈ నాడు 3500 మందికి పైగా తెలంగాణ కుటుంబాలు ఒక చోట కలుసుకొని పండగ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అత్యుత్తమ బతుకమ్మలను ఎంపిక చేసేందుకు న్యాయ నిర్ణీతలుగా మనస్విని వేలపాటి, ప్రదీపా వాల వ్యవహరించారు. ఇందులో విజేతలకి విభూతి ఫ్యాబ్ స్టూడియోస్ వారు, తెలంగాణ కెనడా అసోసియేషన్, సండైన్ తెలుగు ఫుడ్స్ వారు బహుమతులను అందజేశారు.
అలాగే దసరా సంబురాల్లో భాగంగా దుర్గా పూజా జరిపిన అనంతరం జమ్మి ఇచ్చి పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు మనోజ్ రెడ్డి, కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి, సంయుక్త కార్యదర్శి శ్రీ రాజేష్ అర్ర , సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహళిక మ్యాకల, కోశాధికారి వేణుగోపాల్ ఏళ్ల, సంయుక్త కోశాధికారిరాహుల్ బాలనేని, డైరెక్టర్లు -నాగేశ్వరరావు దలువాయి, ప్రవీణ్ కుమార్ సామల, శంకర్ భరద్వాజ పోపూరి, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు మాధురి చాతరాజు, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వర రావు చిత్తలూరి, ప్రకాష్ చిట్యాల, శ్రీనివాస తిరునగరి, శ్రీహరి రావుల్,విజయ్ కుమార్ తిరుమలపురం, అఖిలేష్ బెజ్జంకి, ప్రభాకర్ కంబాలపల్లి, సంతోష్ గజవాడ,రాజేశ్వర్ ఈధ, వేణుగోపాల్ రోకండ్ల పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- bathukamma
- celebrations
- dasara
- Nri
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

