Australia – Student Visa | యూఎస్.. కెనడా బాటలోనే ఆస్ట్రేలియా.. భారత్ విద్యార్థుల వీసా ఫీజు పెంపు.. కారణమిదేనా..!
Australia - Student Visa | విదేశీ విద్యార్థుల తాకిడిని నియంత్రించడానికి విద్యార్థి వీసా దాదాపు రెట్టింపు పెంచుతూ నిర్ణయం తసుకుంది.
Australia – Student Visa | విదేశీ విద్యార్థుల వలసలను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. విదేశీ విద్యార్థుల వీసా ఫీజు దాదాపు రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించింది. పెంచిన వీసా ఫీజు జూలై ఒకటో తేదీ (సోమవారం) నుంచి అమల్లోకి వస్తుంది. అంటే ఇంతకుముందు వీసా ఫీజు 710 ఆస్ట్రేలియా డాలర్లు ఉండగా, దాన్ని 1600 ఆస్ట్రేలియా ($1068) డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. అంతే కాదు విజిటర్ వీసాతోపాటు తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసాతో ప్రస్తుతం దేశంలోనే ఉన్న వారు ‘విద్యార్థి వీసా’ కోసం దరఖాస్తు చేయకుండా నిషేధం విధించింది. రికార్డు స్థాయిలో విదేశీ విద్యార్థుల రాకను నియంత్రించడంతోపాటు విదేశీ విద్యార్థులకు వసతి దొరకడం దుర్లభంగా మారింది. ‘మా అంతర్జాతీయ విద్యా వ్యవస్థ సమగ్రతను పరిరక్షించేందుకు ఈ రోజు ఈ మార్పులు తీసుకొచ్చాం. స్వేచ్ఛగా, ఆస్ట్రేలియాకు మెరుగైన సేవలందించేలా ఉండేలా మైగ్రేషన్ సిస్టమ్ క్రియేట్ చేస్తాం’ అని ఆస్ట్రేలియా హోంమంత్రి క్లేర్ ఓ నీల్ తెలిపారు.
ఇప్పటి వరకూ విదేశీ విద్యాభ్యాసానికి వెళ్లాలంటే భారతీయ విద్యార్థులు అమెరికా, కెనడా ఆప్షన్ ఎంచుకునే వారు. కానీ ఆ రెండు దేశాల విద్యార్థి వీసాలు సుమారు 185 అమెరికా డాలర్లు, 110 అమెరికా డాలర్లు (కెనడా వీసా ఫీజు) పెరిగాయి. ఈ నేపథ్యంలో విదేశీ విద్యాభ్యాసం చేయాలని భావించే భారతీయ విద్యార్థులు ప్రత్యామ్నాయ ఆప్షన్‌గా ఎంచుకున్నారు. 2022-23లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియాకు వస్తున్న విద్యార్థులు 30 శాతం పెరిగారు. 2022-23లో 1.50 లక్షల మందికి పైగా విదేశీ విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆస్ట్రేలియాకు వచ్చారు.
విదేశీ విద్యార్థుల రాకను నియంత్రించడానికి 2022 చివర్లో ఉన్నత విద్యాభ్యాసానికి వచ్చే విదేశీ విద్యార్థుల వీసా పాలసీలో పలు మార్పులు చేసింది. తొలుత ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ కఠినతరం చేసింది. విదేశీ విద్యార్థుల పొదుపు మొత్తాలను 24505 ఆస్ట్రేలియా డాలర్ల నుంచి 29,710 ఆస్ట్రేలియా డాలర్ల (19,823 యూఎస్ డాలర్ల)కు పెంచేసింది. ఏడు నెలల్లో విదేశీ విద్యార్థుల పొదుపు మొత్తాల పరిమితిని రెండుసార్లు పెంచేసింది.
విద్యార్థి వీసా నిబంధనలను కఠినతరం చేయడం పట్ల ఆస్ట్రేలియా యూనివర్సిటీస్ సీఈఓ లూక్ షీయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇది మా ఆర్థిక వ్యవస్థకు, మా యూనివర్సిటీలకు మంచిది కాదు. మా ఆర్థిక వ్యవస్థ, మా యూనివర్సిటీలు పూర్తిగా విదేశీ విద్యార్థుల ఫీజుపైనే ఆధార పడి ఉన్నాయి’ అని లూక్ షీయ్ పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో విదేశీ విద్య వల్ల ఆస్ట్రేలియాకు 36.4 బిలియన్ డాలర్ల ఆదాయం లభించింది.
ఇవి కూడా చదవండి :
Small Cap Funds | 27 స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో బెంచ్ మార్క్ రిటర్న్స్ అందించిన ఫండ్స్ ఇవే..!
| Most Affordable Cars | రూ.5 లక్షల్లోపు ధర గల కార్లు కావాలా.. మూడే ఆప్షన్లు.. అవేంటంటే..?!
Edit |
|
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

