ATA Day | అత్యంత వైభవంగా ఆటా డే, ఉగాది వేడుకలు
ATA Day | అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) Arizona నిర్వహించిన ATA-డే AZ 2023 ఈ కార్యక్రమం ఎంతో కలర్ ఫూల్‌గా, పవర్ ప్యాకెట్‌గా, సేవ యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శిస్తుంది. తెలుగు సంస్కృతి( Telugu Culture ) యొక్క వైవిధ్యం, గొప్పతనాన్ని తెలియజేసింది. ఈ వేడుకలు మార్చి 26న ముగిశాయి.
ATA Day | అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) Arizona నిర్వహించిన ATA-డే AZ 2023 ఈ కార్యక్రమం ఎంతో కలర్ ఫూల్‌గా, పవర్ ప్యాకెట్‌గా, సేవ యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శిస్తుంది. తెలుగు సంస్కృతి( Telugu Culture ) యొక్క వైవిధ్యం, గొప్పతనాన్ని తెలియజేసింది. ఈ వేడుకలు మార్చి 26న ముగిశాయి.

అరిజోనా( Arizona ) ఫీనిక్స్‌లోని ఫీనిక్స్ ష్రైన్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాస్త్రీయ, జానపద, ఫ్యూజన్ సంగీతం, నృత్య ప్రదర్శనలు, ఫ్యాషన్ షో, పౌరాణిక నాటకాలను ప్రదర్శించారు. డ్రాయింగ్, స్పీడ్-చెస్ వంటి అనేక ఇతర పోటీలు నిర్వహించారు. వివిధ షాపింగ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఫేస్-పెయింటింగ్, ప్లే-జోన్‌తో సహా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

ప్రముఖ గాయకులు రఘు కుంచె, అంజనా సౌమ్య ప్రత్యక్ష మ్యూజిక్ కన్సర్ట్ ఏర్పాటు చేశారు. వారి పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించరు. ఈ కార్యక్రమం స్థానిక కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక వేదికను కూడా అందించింది. ఈ ఈవెంట్లో 1500 మందికి పైగా హాజరయ్యారు. ఫీనిక్స్‌లో తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడానికి వేదికను అందించిన తెలుగు సాంస్కృతిక కార్యక్రమం ATA డే అద్భుతంగా విజయవంతమైంది.

ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రాంతీయ కోఆర్డినేటర్లు వంశీ ఏరువరం, శేషిరెడ్డి గాదె, చెన్న మద్దూరి, ధీజ్ పోల, సునీల్ అననపురెడ్డి, మధన్ బొల్లారెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.



Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

