NRI | కేసీఆర్‌కు వెలుగు పత్రిక వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే : అనిల్ కూర్మాచలం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వెలుగు దిన పత్రికలో ‘కేసీఆర్ ఫామ్ హౌస్ కు మళ్లిన కొండపోచమ్మ’ అనే తప్పుడు కథనాన్ని ప్రచురించడాన్నిఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్దీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం తీవ్రంగా ఖంచారు.
లండన్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వెలుగు దిన పత్రికలో ‘కేసీఆర్ ఫామ్ హౌస్ కు మళ్లిన కొండపోచమ్మ’ అనే తప్పుడు కథనాన్ని ప్రచురించడాన్నిఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్దీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం తీవ్రంగా ఖంచారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు రవి రేతినేని & కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెలుగు పత్రిక యాజమాన్యం ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే లక్ష్యంతో రాజకీయ దురుద్దేశపూరిత కథనాలను ప్రచురిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ, వాటిపై దృష్టి సారించి ప్రజల గొంతుకగా నిలవాల్సిన బాధ్యతను V6 వెలుగు విస్మరిస్తోందని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాల్సిన మీడియా కనీస పాత్రికేయ విలువలను పక్కనపెట్టి కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా కథనాలు ప్రచురించడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు.
ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఏకపక్ష కథనాలను ప్రచురించడం పత్రికా విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద నీరు అందుబాటులో ఉన్నప్పటికీ దాన్ని ఎత్తిపోసి రైతులకు సాగునీరు అందించకుండా, ప్రాణహిత జలాలను వృథాగా సముద్రంలోకి వెళ్లనిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన వెలుగు అందుకు భిన్నంగా కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసే కథనాలతో కాలయాపన చేయడం అత్యంత దారుణమని అనిల్ మండిపడ్డారు. ప్రజా సమస్యలను విస్మరించి, కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు కథనాలు ప్రచురించడమే వెలుగు లక్ష్యమా అని అనిల్ కూర్మాచలం ప్రశ్నించారు.
వెలుగు పత్రిక ప్రచురించిన కథనాలపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఆ పత్రిక యాజమాన్యానికి, ఎడిటర్‌కు నోటీసులు జారీ చేసిందని, 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నారైల పక్షాన కూడా V6 వెలుగు యాజమాన్యం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలను ఎన్నారైలు ఇకపై ఉపేక్షించబోరని ఆయన హెచ్చరించారు. ఇటువంటి కథనాలు ప్రచురిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్నారైలను ఏకం చేసి, అవసరమైతే ప్రత్యక్ష నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
దమ్ముంటే వెలుగు పత్రిక కొండపోచమ్మ సాగర్, కాలువల మార్గాలను కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంతో ముడిపెడుతూ ప్రచురించిన కథనాలకు ఆధారాలను ప్రజల ముందు పెట్టాలని లేకుంటే రానున్న రోజుల్లో ప్రజా క్షేత్రంలో వీరికి స్థానం లేకుండా చేస్తామని ఉపాధ్యక్షుడు రవి రేతినేని ఆగ్రహం వ్యక్తం చేసారు. V6 వెలుగు పత్రిక 24 గంటల్లోగా వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకుని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి క్షమాపణను మొదటి పేజీలో తగిన ప్రాధాన్యంతో ప్రచురించాలని ఎన్నారై బీఆర్ఎస్ కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం, నిష్పాక్షికంగా వ్యవహరించడం మీడియా బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించి రాజకీయ ప్రయోజనాలకు వేదికగా మారడం ప్రజాస్వామ్యానికి, పాత్రికేయ రంగానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
- Tags
- Anil Kurmachalam
- apologize
- KCR
- Nri
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

