Telangana state High Court Recruitment 2023 | తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు.. ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ (నిమిషానికి 45 పదాలు టైప్ చేయడం) వచ్చి ఉండాలి. ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్ టెస్ట్‌లో మెరిట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో మే 25 నుంచి ప్రారంభంకాగా .. జూన్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 96
పోస్టులు : స్టెనోగ్రాఫర్
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు.. ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ (నిమిషానికి 45 పదాలు టైప్ చేయడం) వచ్చి ఉండాలి.
వయస్సు : 18-34 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.32810 నుంచి రూ.96890
ఎంపిక : ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్ టెస్ట్‌లో మెరిట్ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.400.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ప్రారంభ తేదీ : మే 25
చివరి తేది: జూన్ 15
వెబ్సైట్ : https://tshc.gov.in/