Job news: ఐఓసీఎల్‌లో టెక్నికల్, నాన్ టెక్నికల్ ట్రేడ్ అప్రెంటిస్‌లు
ఐఓసీఎల్| దేశంలోనే అతిపెద్ద చమురు మార్కెటింగ్ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) Southern Regionలో టెక్నికల్, నాన్ టెక్నికల్ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద చమురు మార్కెటింగ్ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) Southern Regionలో టెక్నికల్, నాన్ టెక్నికల్ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగి, డిగ్రీ, ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 480 ఖాళీలను భర్తీ చేస్తున్నది. సదరన్ రీజియన్‌లోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళలో ఈ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 480
ఏయే ట్రేడ్లు.. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెషినిస్ట్, అకౌంటెంట్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్, సివిల్, రిటెయిల్ సేల్స్ అసోసియేట్
రాష్ట్రాల వారీగా..
తెలంగాణలో: 42 (ఎలక్ట్రిషన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రెంట్, మెషినిస్ట్, ఎలక్ట్రిషన్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్- ఐటీఐ, డిప్లొమా), అకౌంటెంట్ 12, డాటా ఎంట్రీ ఆపరేటర్ 30, రిటైల్ సేల్స్ అసోసియేట్ 14
ఆంధ్రప్రదేశ్‌లో: 42 (ఎలక్ట్రిషన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రెంట్, మెషినిస్ట్, ఎలక్ట్రిషన్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్), అకౌంటెంట్ 12, డాటా ఎంట్రీ ఆపరేటర్ 30, రిటైల్ సేల్స్ అసోసియేట్ 14
అర్హతలు: ఐటీఐ, డిప్లొమా చేసి ఉండాలి. అదేవిధంగా అకౌంటెంట్ పోస్టులకు డిగ్రీ, మిగిలిన పోస్టులకు ఇంటర్ పాసై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 13 నుంచి
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 28
రాతపరీక్ష: సెప్టెంబర్ 19
వెబ్సైట్: iocl.com
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

