హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో నియామకం చేపట్టింది. వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4103 అప్రెంటిసెస్ను అందిస్తున్నది. ఇందులో ఏసీ మెకానిక్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, ఫిట్టర్, మెషినిస్ట్ వంటి ట్రేడ్లు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది. ఎంపికైనవారికి కాచిగూడ, ఖాజీపేట, మౌలాలీ, లల్లాగూడ, విజయవాడ, తిరుపతి, గూటి, గుంతకల్, నాందేడ్, పూర్ణ షెడ్లలో శిక్షణ అందిస్తారు.
మొత్తం అప్రెంటిస్లు: 4103
ఇందులో ఏసీ మెకానిక్ 250, కార్పెంటర్ 18, డీజిల్ మెకానిక్ 531, ఎలక్ట్రిషన్ 1019, ఎలక్ట్రానిక్ మెకానిక్ 92, ఫిట్టర్ 1460, మెషినిస్ట్ 71, ఎంఎంటీఎం 5, ఎంఎండబ్ల్యూ 24, పెయింటర్ 80, వెల్డర్ 553 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి. అభ్యర్థులు 15 నుంచి 24 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పదో తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 3
వెబ్సైట్: www.scr.indianrailways.gov.in