స్కానింగ్ సెంటర్ల ఘటనపై జడ్పీలో రచ్చరచ్చ
నిజామాబాద్ జిల్లా పరిషత్ పాలకవర్గం చివరి సమావేశం శుక్రవారం వాడీవేడిగా సాగింది. స్కానింగ్ సెంటర్ల వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ప్రజాప్రతినిధులు నిప్పులు చెరిగారు. అక్రమ ఇసుక రవాణా, ఉచిత బస్సు ప్రయాణం తదితర అంశాలపై ప్రశ్నించారు.
- అధికారులపై మండిపడ్డ ప్రజాప్రతినిధులు
- చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీత
- డీఎంహెచ్‌వో సమాధానంపై మహిళా సభ్యుల ధ్వజం
- సిగ్గుచేటన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి
కంఠేశ్వర్,జూన్ 21: నిజామాబాద్ జిల్లా పరిషత్ పాలకవర్గం చివరి సమావేశం శుక్రవారం వాడీవేడిగా సాగింది. స్కానింగ్ సెంటర్ల వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ప్రజాప్రతినిధులు నిప్పులు చెరిగారు. అక్రమ ఇసుక రవాణా, ఉచిత బస్సు ప్రయాణం తదితర అంశాలపై ప్రశ్నించారు. జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్‌రావు అధ్యక్షతన శుక్రవారం చివరి పాలకవర్గ సమావేశం నిర్వహించా రు.
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుతో పాటు కొందరు ఎమ్మెల్యేలు ఈ భేటీకి రాకపోవడంపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు సమావేశం జరుగుతున్న సమయంలో కరెంట్ పోవడంతో జనరేటర్‌తో మీటింగ్‌ను కొసాగించారు. జిల్లా కేంద్రంలో కొద్దిరోజుల నుంచి దుమారంలేపుతున్న అయ్యప్ప స్కానింగ్ సెంటర్ వ్యవహారంపై చర్చ రచ్చకు దారి తీసింది. అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో జరిగిన దారుణంపై ప్రధానంగా సాగిన చర్చలో మహిళా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్కానింగ్ సెంటర్లపై పత్రికల్లో వచ్చిన వరుస కథనాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని మహిళా సభ్యులు డీఎంహెచ్‌వోను నిలదీశారు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో ఎటువంటి ఆధారాలూ దొరకలేదని, సంబంధిత ఫైల్ కలెక్టర్ వద్ద ఉందని డీఎంహెచ్‌వో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థను చక్కదిద్దాల్సిన అధికారులు అక్రమార్కుల వంతపాడటం ఎంతవరకు సబబని వైస్ చైర్పర్సన్ రజితాయాదవ్ ప్రశ్నించారు. అదనపు కలెక్టర్ అంకిత్ కలుగజేసుకుని స్కానింగ్ సెంటర్ వ్యవహారంపై కమిటీ వేశామని, దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సిగ్గుతో తలదించుకుటున్నా..
స్కానింగ్ సెంటర్ వ్యవహారంపై మహిళా సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేక పోవడం సిగ్గుచేటని, సిగ్గుతో తల దించుకుంటున్నానని ఆర్మూర్ ఎమ్మెల్యె పైడి రాకేశ్‌రెడ్డి అన్నారు. ఉద్యోగులు ప్రొటోకాల్ పాటించాలని, ఆర్మూర్ అభివృద్ధికి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అర్మూర్ సొమ్ము కొడంగల్‌కు, నిజామాబాద్ సొమ్ము ఖమ్మంకు మళ్లిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కులమతాలు,పార్టీలకు అతీతంగా జిల్లా అభివృద్ధికి అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ఇసుక అక్రమ రవాణా పట్టదా?
ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణమేమో కానీ ప్రయాణికుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందని కమ్మర్పల్లి ఎంపీపీ గౌతమి అన్నారు. బస్సుల్లో మహిళలకు రక్షణ లేదని, గతంలో సమయానుసారం అందుబాటులో ఉన్న బస్సులు ఇప్పుడు ఎటు పోయాయని ప్రశ్నించారు. ఇసుక అక్రమ రవాణా గురించి మోర్తాడ్ జడ్పీటీసీ రవి అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే రీచ్‌లను వదిలేసి, దొంగతనంగా ఇసుకను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదన్నారు. సమావేశం ముగింపు సమయంలో జడ్పీ చైర్మన్ విఠల్‌రావు జడ్పీటీసీలు, ఎంపీపీలను సత్కరించారు. జడ్పీ సీఈవో ఉషా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

