కాంగ్రెస్ ఝూటా పార్టీ
కాంగ్రెస్ 420 మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను నిండాముంచి గద్దెనెక్కిందని, అదో బడా ఝూటా పార్టీ అని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఆభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌డ్డి సైతం ఝూటా కోర్ అని, అసత్య ప్రచారం చేసి గెలిచిండని, ఇప్పుడు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిండని దుయ్యబట్టారు.
- మోసపూరిత హామీలతో గద్దెనెక్కింది
- ఎంపీ అర్వింద్ జిల్లాకు చేసింది శూన్యం
- నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఆభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్
మల్లాపూర్/ సారంగాపూర్, ఏప్రిల్ 16 : కాంగ్రెస్ 420 మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను నిండాముంచి గద్దెనెక్కిందని, అదో బడా ఝూటా పార్టీ అని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఆభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌డ్డి సైతం ఝూటా కోర్ అని, అసత్య ప్రచారం చేసి గెలిచిండని, ఇప్పుడు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిండని దుయ్యబట్టారు. కాంగ్రెస్, రేవంత్ చెప్పిన అబద్ధాలను ప్రజల ముందు ఎండగట్టాలని, ఓటుతో బుద్ధి చెప్పేలా చైతన్యం కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. మంగళవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావుతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. కేఎంఆర్ గార్డెన్స్‌లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
సాయంత్రం బీర్పూర్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మండపంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ మార్క్‌ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డితో కలిసి హాజరయ్యారు. ఆయా చోట్ల ఆయన మాట్లాడారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు జీవన్‌రెడ్డి అడ్డువస్తున్నారనే కారణంతో అధిష్టానం జీవన్‌రెడ్డిని ఎన్నికల బరిలో నిలిపిందన్నారు. ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. నిధులు తీసుకురాని అసమర్థుడు ధర్మపురి అర్వింద్ అని, ఈ ఐదేండ్లలో చేసింది శూన్యమని, ప్రజలకు ముఖం చూపించే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని, మీ కోసం పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకగా నిలుస్తానని, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

