పోతంగల్: ఉచిత పశు వైద్య శిబిరాలను ( Veterinary camps ) పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ కోటగిరి డైమండ్ అధ్యక్షుడు, బీఆర్ఎస్ నాయకుడు తెల్ల రవికుమార్ ( Ravi Kumar ) అన్నారు. పోతంగల్ మండలంలోని హంగర్గఫారంలో గురువారం లయన్స్ క్లబ్ సహకారంతో పశు సంవర్థక శాఖ, పీవీ నరసింహారావు తెలంగాణ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన జాతీయ సేవ పథకంలో ప్రత్యేక ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా పశువైద్య నిపుణులు పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రజియా బేగం, మండల పశువైద్యాధికారి డాక్టర్లు సురేష్, నాగరాజు, గోపాలకృష్ణ, అరుణ, ఫణీంద్ర, జయశ్రీ, రవి కుమార్, మాజీ సర్పంచ్ ఏజాజ్ ఖాన్, దిలీప్ కుమార్, కృష్ణ ప్రసాద్ రెడ్డి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.