Velpur | ఉనికి కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వేల్పూర్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడారు.

వేల్పూర్: అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వేల్పూర్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడారు. బాల్కోండ నియోజకవర్గంలో వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం, సాగునీటి వనరులు పెంచడానికి కప్పలవాగు, పెద్దవాగులపై చెక్‌డ్యాంలను నిర్మించడం జరిగిందన్నారు. చెక్‌డ్యాం వల్ల వాగులకు ఇరువైపుల ఉన్న గ్రామాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయన్నారు. నీటి వనరులు పెరగడం వల్ల రైతులు రెండు పంటలను సాగు చెసుకుంటున్నారని అన్నారు. గతంలో నీటి వనరులు లేక గ్రామాల్లో బీడు భూములుగా ఉండేవన్నారు.
మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చొరవతో కప్పలవాగు, పెద్దవాగులపై 22 చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందన్నారు. వీటిలో కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలినవి తుదిదశలో ఉన్నాయన్నారు. నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నా కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదన్నారు. ప్రతి మండల కేంద్రంలో డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనుల కోసం నిధులను మంజూరు చేసిందన్నారు. వీటితో పాటు ఆయా గ్రామాల్లోని ప్రధాన రోడ్లన్నీ డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.130 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ నాగాధర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నాడ్డి, ఎంపీపీ భీమా జమున తదితరలు ఉన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

