Vaccination | ప్రజలకు చేరువలో వ్యాక్సినేషన్ కేంద్రాలు

ఆర్మూర్ : కరోనాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రజలకు మరింత చేరువగా కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆర్మూర్ జడ్పీటీసీ మెట్టు సంతోష్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పుట్టింటి లింబారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నాలు అన్నారు. శుక్రవారం ఆర్మూర్ మండలంలోని మంథని గ్రామంలో, మున్సిపల్లోని మున్సిపల్ 22వ వార్డులో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్ టీకా కేంద్రాన్ని వారు పరిశీలించి మాట్లాడారు. కొవిడ్ వ్యాక్సినేషన్ టీకా కేంద్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వైద్యశాఖ సిబ్బందికి సూచించారు.
ఆర్మూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో, ఆర్మూర్ మున్సిపల్లోని అన్ని వార్డుల్లో టీకా కేంద్రాలను సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, కౌన్సిలర్లు పరిశీలించి వైద్యసిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆర్మూర్‌లో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నా వ్యాక్సిన్ వేయించుకున్నారు. మున్సిపల్ పరిధిలోని కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ తనిఖీ చేసి వైద్యసిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమాల్లో దేగాం వైద్యాధికారి భాస్కర్‌రావు, వైద్యులు స్వాతి వినూత్న, ప్రవీణ, అమృత్‌రాంరెడ్డి, ఆర్మూర్ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ నాగరాజు, మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్, ఆరోగ్య సూపర్వైజర్లు అర్గుల్ సుభాష్, చంద్రశేఖర్, ఆనవాల, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

