సిరులిచ్చే.. కొత్తిమీర
కొత్తిమీర.. వంటింటికి నిత్యావసర వస్తువు. ఏ కూర వండినా కొత్తిమీర వేయాల్సిందే! అందుకే, దీనికి అన్ని కాలాల్లోనూ డిమాండ్ ఉంటుంది. ఇటు కూరకు కొత్త రుచిని తెస్తూనే అన్నదాతకు మంచి ఆదాయాన్నిస్తుంది.
- తక్కువ పెట్టుబడి…అధిక లాభం
- నెలన్నరలో పంట చేతికి
- అద్భుతాలు సృష్టిస్తున్న పెర్కిట్ రైతు
కొత్తిమీర.. వంటింటికి నిత్యావసర వస్తువు. ఏ కూర వండినా కొత్తిమీర వేయాల్సిందే! అందుకే, దీనికి అన్ని కాలాల్లోనూ డిమాండ్ ఉంటుంది. ఇటు కూరకు కొత్త రుచిని తెస్తూనే అన్నదాతకు మంచి ఆదాయాన్నిస్తుంది. చిన్న పంటే ఆసరా అవుతూ స్వల్పకాలంలోనే చేతికందుతూ.. కర్షకులను కష్టాలనుంచి గట్టెక్కిస్తుంది. ఏడాదంతా డిమాండ్ ఉండే ఈ కొత్తిమీర రైతుల ఇంటి సిరులు కురిపిస్తున్నది.
ఆర్మూర్, మే 11: తక్కువ పెట్టుబడి..నెలన్నర వ్యవధిలో చేతికొచ్చే కొత్తిమీర పంటను సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ గ్రామానికి చెందిన రైతు పెద్దకాపు రవి. వంటల్లో మంచి సువాసన, రుచితోపాటు అధిక పోషకాలు కలిగిన కొత్తిమీర సాగుతో సిరులు సంపాదిస్తున్నాడు. తన వ్యవసాయ క్షేత్రంలో వరి, మక్కజొన్న ఇతర సంప్రదాయ పంటలతోపాటు కొత్తిమీరను సాగు చేస్తున్నాడు. కేవలం నెలన్నర కాల వ్యవధిలోనే పంట చేతికి వస్తుండడం.. నిత్యావసరాలకు, అధిక డిమాండ్ ఉండే పెండ్లిళ్లు, శుభకార్యాల సమయంలో పంట చేతికి వచ్చేలా ప్రణాళికాబద్ధంగా కొత్తిమీర పంటను సాగు చేస్తున్నాడు. రెండు ఎకరాల విస్తీర్ణంలో 20 నుంచి 30 రోజుల తేడాతో కొత్తిమీర పండిస్తున్నాడు. ఎకరం విస్తీర్ణంలో సాగు చేసిన పంట కోత దశకు చేరగా ఇటీవల పంటను కోసి విక్రయించాడు. మరో ఎకరంలో వేసిన కొత్తిమీర మరో వారం రోజుల్లో చేతికి వస్తుంది. ప్రస్తుతం వేసవికాలం, పెండ్లిళ్ల సీజన్ కావడంతో కొత్తిమీర పంటకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది.
పెట్టుబడి తక్కువ.. లాభం ఎక్కువ…
కొత్తిమీర సాగు చేసేందుకు ఎకరానికి రూ.12వేలు ఖర్చవుతుంది. విత్తనాలకు రూ.6వేలు, అడుగు మందుకు రూ.1600, కలుపు నివారణకు రూ.3వేలు, ఇతర నిర్వహణ ఖర్చులకు మరో రూ.2500 వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. విత్తనం నాటిన నుంచి మార్కెట్‌కు తరలించడానికి నెలన్నర సమయం మాత్రమే కావడం, ఎకరానికి ఒక్క పంటకు రూ.లక్ష వరకు కొనుగోలు చేస్తుండడంతో పంట సాగుకు అయ్యే రూ.12వేలు పోను నికర రూ.88వేల వరకు లాభాలు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం మార్కెట్లో కొత్తిమీర పంటకు డిమాండ్ ఉండడంతోపాటు రవి పండించిన కొత్తిమీర నాణ్యమైనదిగా ఉండడంతో వ్యాపారులు నేరుగా వ్యవసాయ క్షేత్రానికి వచ్చి అడ్వాన్స్‌లు చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు. దీంతో పంటను మార్కెట్‌కు తరలించి విక్రయించే పని తప్పడంతోపాటు రవాణా ఖర్చులు సైతం మిగులుతున్నాయి.
పెట్టుబడి తక్కువే..
ఇతర పంటలతో పోలిస్తే కొత్తిమీర పంటకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. అన్ని సీజన్లలో కొత్తిమీరకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. పెట్టుబడి తక్కువ.. లాభాలు బాగుండడంతో కొత్తిమీర సాగు చేస్తున్నాను. ఈ ఏడాది కొత్తిమీరకు మంచి ధర పలుకుతున్నది. ఇంత మొత్తంలో పంటకు ధర రావడం గతంలో ఎప్పుడూ చూడలేదు.
-పెద్దకాపు రవి, రైతు పెర్కిట్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

