మళ్లీ నీరాశే..
అనుకున్నట్లే అయ్యింది. పసుపు బోర్డు ఏర్పాటు విషయంపై కేంద్ర ప్రభుత్వం దాటవేసింది. పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్ 2024-25లో ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన హామీపై ఎలాంటి స్పష్టత రాలేదు.
- యథాలాపంగానే కొనసాగిన వివక్ష
- పసుపు బోర్డు ఏర్పాటు ప్రస్తావనే కరువు
- రైల్వే అభివృద్ధిపైనా అస్పష్టమైన ప్రకటన
- వేతన జీవులకు కొత్త పన్ను విధానం అమలు
నిజామాబాద్, జూలై 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి): అనుకున్నట్లే అయ్యింది. పసుపు బోర్డు ఏర్పాటు విషయంపై కేంద్ర ప్రభుత్వం దాటవేసింది. పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్ 2024-25లో ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన హామీపై ఎలాంటి స్పష్టత రాలేదు. ఉమ్మడి జిల్లా ప్రజలు ఆశించిన ప్రయోజనాలకూ మోక్షం దక్కలేదు. ఉత్తర తెలంగాణలోని నాలుగైదు జిల్లాల్లోని రైతులు ఆశించిన మేరకు పసుపు బోర్డుపై కేంద్రం ఎలాంటి మాటెత్తకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందుకు పీఎం మోదీ చెప్పిన విధంగా పసుపు బోర్డు విషయంలో కేంద్రబడ్జెట్లో ప్రస్తావన ఉంటుందని అంతా ఊహించారు.
అందుకు భిన్నంగానే గతం మాదిరిగానే వివక్షను కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రదర్శించారు. ఇతర రాష్ర్టాలకు తాయిలాలు ఘనంగా ప్రకటించగా, తెలంగాణ రాష్ర్టానికి మొండి చేయి చూపారు. అందులో ఉమ్మడి జిల్లాకు అంతులేని నిరాశే మిగిలింది. ఈ ప్రాంతం నుంచి రెండు దఫాలుగా బీజేపీ ఎంపీగా ధర్మపురి అర్వింద్ కొనసాగుతున్నప్పటికీ ఈ ప్రాంత ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చకపోవడం కనిపిస్తున్నది. ఎంపీగా ధర్మపురి అర్వింద్ వైఫల్యతను ఈ బడ్జెట్ తీరుతో తేటతెల్లమైంది. రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పక్కకు పెడితే డబ్లింగ్, కొత్త రైల్వేలైన్ ప్రతిపాదన, కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రతిపాదనలేవీ కేంద్రం పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు.
రైతులకు మొండిచేయి..
అసెంబ్లీ ఎన్నికలకు నెలన్నర రోజుల ముందు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిజామాబాద్‌లో చేసిన ప్రకటనకు విలువ లేకుండా పోయింది. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ చెప్పినప్పటికీ అనంతర కాలంలో ఓటాన్ అకౌం ట్ బడ్జెట్లో, పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ 2024-25లో ఇందుకు సంబంధించిన ప్రకటనే లేకపోవడం రైతులను కలవరపెడుతున్నది. ఎంపీ అర్వింద్ నామమాత్ర పాత్రకే పరిమితం కావడం తప్ప.. నోరు విప్పి రైతుల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రస్తావించిన దాఖలాలే లేకపోవడం శోచనీయమంటున్నారు
అంతా ఉత్తిదే..
డబుల్ సీట్లను కొల్లగొట్టి రాజకీయంగా బలం పుంజుకున్నప్పటికీ తెలంగాణ ప్రాంతంపై బీజేపీ అధినాయకత్వానికి పట్టరాని నిర్లక్ష్యం బడ్జెట్లో కేటాయింపులతో తేటతెల్లం చేస్తున్నది. గతంలో కేంద్రం చూపే వివక్షపై రాష్ట్రంలోని కేసీఆర్ సర్కారు అడుగడుగునా ఎండగట్టేది.
రైల్వే అభివృద్ధిపైనా శీతకన్ను…
రైల్వే విస్తరణ పనులు, అభివృద్ధిపై కేంద్ర సర్కారు శీతకన్ను కొనసాగింది. నిజామాబాద్ నుంచి డబ్లింగ్ రైల్వే ట్రాక్, ఆర్మూర్ – ఆదిలాబాద్, బీద ర్ – బోధన్ రైల్వే లైన్ ప్రతిపాదనలు పట్టాలెక్కక పోగా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు.
నలుగురు.. ఎనిమిది అయినా లాభంలేదు
కంఠేశ్వర్, జూలై 23: బడ్జెట్లో తెలంగాణకు మోదీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర సహాయక మంత్రులుగా ఉన్నప్పటికీ నిధులు తేవడంలో విఫలమయ్యారు. ధర్మపురి అర్వింద్ ఐదేండ్లు ఎంపీగా ఉండి ఇప్పుడు మళ్లీ ఎంపీ అయినా కూడా ప్రవర్తనలో, ఆలోచనలో మార్పు రాలేదు. తెలంగాణ నుంచి బీజేపీకి నలుగురు ఉన్న ఎంపీలు రెట్టింపై ఎనిమిది మందికి చేరినా రాష్ర్టానికి నిధులు రాకుండా మోసం చేశారు.
– షబ్బీర్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు
తెలంగాణకు మొండి చేయి..
కామారెడ్డి, జూలై 23: బీజేపీ ప్రభుత్వం పడిపోకుండా ఉండేందుకు తెలంగాణకు అన్యాయం చేసి ఆంధ్రాకు మాత్రమే న్యాయం చేశారు. తెలంగాణకు మొండి చేయి చూపారు. రాష్ట్రంలో ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నప్పటికీ ఎలాంటి నిధులు తేలేదు. ఈ మంత్రులు ఉంటే ఎంత పోతే ఎంత. తెలంగాణకు బీజేపీ అన్యాయం చేసింది. అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు ఏమీ ఇవ్వకుండా, ఆంధ్రాకు రూ.15వేల కోట్లు ఇచ్చారు.
– ముజీబుద్దీన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, కామారెడ్డి
విద్యారంగానికి నిరాశ..
ఎల్లారెడ్డి రూరల్, జూలై 23: విద్యారంగానికి బడ్జెట్లో కనీసం 10శాతం నిధులు కేటాయించాలని విద్యా కమిషన్లు సూచించినప్పటికీ, 2.66 శాతం కేటాయించడం చూస్తే కేంద్ర ప్రభుత్వం విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యత అర్థమవుతుంది. తగిన కేటాయింపులు లేకుండా
అందరికీ నాణ్యమైన విద్య అందించడం అసాధ్యం.
-అనిల్‌కుమార్, టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఉంది
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసేలా కేంద్ర బడ్జెట్ ఉన్నది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఎలాంటి నిధు లు కేటాయించలేదు. పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉండేది. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు రాష్ర్టానికి మేలు జరిగేలా చూడాలి.
-వెంకన్నగుప్తా, పారిశ్రామికవేత్త, బాన్సువాడ
తెలంగాణపై సవతి ప్రేమ..
ఖలీల్‌వాడి, జూలై 23: కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి ఏమాత్రం నిధులు కేటాయించకపోవడం బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణపై ఉన్న సవతి ప్రేమను తెలియజేస్తున్నది. బోధన్-బీదర్ రైల్వేలైన్, నిజాంషుగర్ ఫ్యాక్టరీ, జక్రాన్‌పల్లి విమానాశ్రయానికి నిధులు కేటాయించకపోవడం నిరాశకు గురిచేసింది. బీజేపీ ఎంపీలు నోరు మెదపకపోవడం సరికాదు.
– రమేశ్‌బాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

