ఏటీఎంనే ఎత్తుకెళ్లారు
ఏటీఎంను కొల్లగొట్టాలనుకున్న దొంగలకు లాకర్ తెరవడం సాధ్యం కాలేదు. దీంతో ఏకం గా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
- లాకర్ తెరుచుకోలేదని మిషన్ అపహరణ
బిచ్కుంద, జూలై 9: ఏటీఎంను కొల్లగొట్టాలనుకున్న దొంగలకు లాకర్ తెరవడం సాధ్యం కాలేదు. దీంతో ఏకం గా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. మాస్కులు ధరించిన దుండుగులు తెల్లవారుజామున 3.25 గంటల సమయంలో ఎస్బీఐకి చెందిన ఏటీఎం సెంటర్లోకి చొరబడ్డారు. సీసీ కెమెరాలపై స్ప్రే చేసి, ధ్వంసం చేసి, ఏటీఎంను తెరిచేందుకు యత్నించా రు. అయితే, ఇది గమనించిన గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పెట్రోలింగ్ సిబ్బంది అక్కడకు చేరుకునే లోపు దొంగలు ఏ టీఎం మిషన్‌తో సహా ఉడాయించా రు. బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ నరేశ్, ఎస్సై మోహన్‌రెడ్డి చోరీ జరిగిన ఏటీఎంను పరిశీలించారు. చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు మ హారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు పోలీసులను అప్రమత్తం చేశారు. ఏటీఎంలో రూ. 3.95 లక్షల నగదు ఉన్న ట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. మరోవైపు, జుక్కల్ మండలంలోని పెద్ద గుల్లా గ్రామ శివారులో అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని బిచ్కుంద ఠాణాకు తరలించారు. అయితే, దొంగలే ఆ వాహనాన్ని వదిలి మరో వాహనంలో ఏటీఎంను తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఎస్బీఐ మేనేజర్ మోహన్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

